రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది విద్యార్థులు 'విదేశీ విద్యా దీవెన' పథకం ద్వారా విదేశాల్లో చదువుతున్నారు. గత కొంతకాలంగా ఈ పథకం నిధులు విడుదల చేయట్లేదని ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్.. తన పాదయాత్ర సమయంలో విదేశీ విద్యా దీవెన పథకం కింద ఇచ్చే నిధులను రూ. 15 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారని... ఆ ధైర్యంతోనే అప్పులు చేసి మరి పిల్లలను విదేశాలకు పంపించామని తల్లిదండ్రులు తెలిపారు.
ఇప్పుడు నిధులు రాకపోవడంతో విదేశాలల్లో ఉన్న తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తమ నిరసన తెలిపేందుకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. వందల మంది విద్యార్థులు విదేశీ విద్యా దీవెన నిధుల కోసం ఎదురుచూస్తున్నారని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.
ఇదీ చదవండి..
YSR Cheyutha : అర్హులైన ప్రతీ మహిళకు వైఎస్సార్ చేయూత: సీఎం జగన్