ETV Bharat / city

దున్న అని వదిలేయొద్దు, దానితో ఎన్ని లాభాలో తెలుసా

Bison benefits రైతులు అదనపు ఆదాయం పొందటానికి దున్నపోతుల పెంపకం మంచి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు. మగ గేదె దూడ(దున్నపోతు)ను ఏడాది పాటు పెంచితే 240 కిలోల వరకు బరువు పెరుగుతుందన్నారు. దున్నపోతులకు దేశవిదేేశాల్లో మంచి గిరాకీ ఉందని వెల్లడించారు. వ్యక్తిగత యూనిట్లకు బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తున్నాయన్నారు. లబ్ధిదారుడు వడ్డీతో సహా రుణాన్ని బ్యాంకుకు చెల్లిస్తే నాబార్డు నుంచి వడ్డీ రాయితీ అందుతుందన్నారు.

Bison benefits
దున్నల పెంపకం వల్ల లాభాలు
author img

By

Published : Aug 20, 2022, 2:41 PM IST

Updated : Aug 20, 2022, 4:30 PM IST

Bison farming గేదెకు మగ దూడ(దున్న) పుడితే రైతులు తలపట్టుకొంటారు.. తల్లిపాలు కూడా పట్టకుండా దున్నను నిర్లక్ష్యం చేయడం చూస్తుంటాం.. కానీ ఇప్పుడు అవే కాసులు కురిపించే వనరులుగా మారాయి. పాడి రైతులకు అదనంగా ఆదాయం పొందడానికి దున్నపోతుల పెంపకాన్ని తరుణోపాయంగా నిపుణులు సూచిస్తున్నారు. మాంసం కోసం మాత్రమే వినియోగించే దున్నపోతులకు దేశవిదేేశాల్లో మంచి గిరాకీ ఉంది. దున్నలను సేకరించి మాంసం రూపంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 240 కిలోల బరువుకుపైగా ఉన్న దున్నలను ఎంపిక చేసుకుంటున్నారు. కిలో లైవ్‌ సుమారు రూ.200 ధర పలుకుతుంది. ఇందులో లాభాలు రుచిచూసిన పోషకులు నెలల వయసున్న దున్నల కోసం అన్వేషిస్తున్నారు. గతంలో రైతులు దున్నలను వ్యవసాయ అవసరాల కోసం పోషించేవారు. యంత్రాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయంలో వీటి వాడకం తగ్గింది. చాలామంది గేదెలు, ఆవులు, గొర్రెలను డెయిరీ రూపంలో పెంచుతున్నారు. ఇదే విధానంలో దున్నపోతుల పెంపకంతో ఆదాయం పొందే అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
ఏడాది పెంపకంతో 240 కిలోలు.. నెలల వయసు ఉన్న మగ గేదె దూడ(దున్నపోతు)ను ఏడాది పాటు పెంచితే 240 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ప్రోటీను కలిగిన దాణా వేయడం ద్వారా నిర్దేశిత సమయంలోనే తగిన బరువుకు పెంచవచ్చు. ఈ దశలో స్లాటర్‌ యూనిట్ల వారు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. వాణిజ్యస్థాయిలో పెంచితే హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న స్లాటర్‌ యూనిట్ల వారు ముందస్తు ఒప్పందాలు చేసుకుని కొనుగోలు చేస్తున్నారు. దున్నపోతుల్లో మాంసాన్ని కొన్ని విభాగాలుగా చేసి ఎగుమతి చేయడం, ఫార్మా పరిశ్రమకు సరఫరా చేయడం, తోలు పరిశ్రమకు చర్మాన్ని ముడిసరకుగా వాడుతుండటంతో రోజురోజుకు వీటికి డిమాండ్‌ పెరుగుతుంది. పాడి రైతులు అదనపు ఆదాయం పొందడంలో భాగంగా దున్నపోతులను ఏడాదిపాటు పెంచితే ఆశించిన ఆదాయం పొందవచ్చని గుంటూరు పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గ్రామాల్లో యువత డెయిరీ పామ్‌ విధానంలో ఈ వ్యాపకాన్ని చేపట్టవచ్చు. ఇందుకు నాబార్డు రాయితీలు ఇచ్చి ప్రోత్సాహం అందిస్తోంది. మాంసం, ఉప ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా భవిష్యత్తులో మరింత ధరలు లభించే అవకాశం ఉందని వివరించారు.

దున్నలకు డిమాండ్‌..

గ్రాసం, దాణా ఆదా చేసే ఉద్దేశంతో రైతులు మగ గేదె దూడలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వీటిని పెంచితే మాంసం ఉత్పత్తి, తోలు పరిశ్రమలో ముడిసరకుగా ఉపయోగపడుతుంది. కొన్ని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. దీంతో దున్నపోతులకు డిమాండ్‌ పెరిగింది. ఎగుమతి మార్కెట్‌ విస్తృతంగా ఉండటం, దేశీయంగానూ వినియోగం ఉండటంతో వీటి అవసరాలు పెరిగాయి. వాణిజ్యస్థాయిలో దున్నలను పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దున్నలను పెంచడానికి రైతులు, కంపెనీలు, భాగస్వామ్యసంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది.

రాయితీలు ఇలా..

* ఒకటి నుంచి 9 వరకు మగ గేదె దూడలున్న రైతుకు ఒక్కొక్క దూడకు రూ.6400 రుణం ఇస్తారు. దీనికి వంద శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. వ్యాక్సిన్‌, బీమా, దాణాకు ఉపయోగించుకోవాలి.

* 10 నుంచి 50 దూడలు ఉంటే వాణిజ్య యూనిట్‌గా గుర్తిస్తారు. దూడల కొనుగోలు, షెడ్డు నిర్మాణం, దాణా, వ్యాక్సిన్లు, బీమాకు వెచ్చించే సొమ్ములో 25 శాతం రాయితీగా అందిస్తారు.

* 1000 దూడల పారిశ్రామిక యూనిట్‌ ఖరీదు రూ.83.45 లక్షలు. ఇందులో 25 శాతం రాయితీగా అందిస్తారు.

* వ్యక్తిగత యూనిట్లకు ఒక సంవత్సర కాలానికి స్వల్పకాలిక రుణం బ్యాంకులు మంజూరు చేస్తాయి. లబ్ధిదారుడు వడ్డీతో సహా రుణాన్ని బ్యాంకుకు చెల్లిస్తే నాబార్డు నుంచి వడ్డీ రాయితీ అందుతుంది.

* వాణిజ్య, పారిశ్రామిక యూనిట్లకు సంబంధించి అందించే రుణం 4-6 సంవత్సరాల వ్యవధిలో చెల్లించాలి. వీరికి నాబార్డు 25 శాతం సొమ్మును రాయితీగా అందజేస్తుంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 20, 2022, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.