అనంతపురం నుంచి చిలకలూరిపేట బైపాస్ వరకు నిర్మించనున్న యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టుల్లో చేర్చింది. దీనివల్ల ఈ ప్రాజెక్డు పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది.
మొదట అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో కలిసేలా 384 కి.మీ మేర ఈ రహదారిని నిర్మించాలనుకున్నారు. ఇప్పుడు చిలకలూరిపేట బైపాస్‌లో కలపడంతో 50 కి.మీ తగ్గుతోంది.
మొత్తం 19 ప్యాకేజీలుగా దీనిని నిర్మించనున్నారు. గుంటూరు జిల్లా పరిధిలో అలైన్మెంట్ మారడంతో ఇక్కడి ప్యాకేజీల సమగ్ర ప్రాజెక్ట్ నివేదికల్లో మార్పులు చేస్తున్నారు. మరోవైపు భూసేకరణ కూడా వేగవంతం చేయనున్నారు.
గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో అటవీ, ప్రభుత్వ భూమి కాకుండా 3500 హెక్టార్ల పట్టా భూములు సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.2500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వెచ్చించనున్నాయి. మూడురోజుల కిందట భూసేకరణపై అధికారులు సమీక్ష జరిపారు. ఎక్కువ భాగం భూసేకరణ పూర్తయితే, భారత జాతీయ రహదారులు ప్రాధికార సంస్థ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవనుంది.
ఇదీ చదవండి: డిగ్రీ, పీజీ, బీటెక్ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు!