ETV Bharat / city

"తెలంగాణ వంటకాలేందో జర చెప్పుండ్రి.." స్వయంగా పరిశీలించిన ప్రధాని మోదీ

హైదరాబాద్​లో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ప్రతినిధులకు.. వడ్డించే వంటకాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు. కొన్ని వంటలను టేస్ట్ కూడా చేశారు. మరికొన్నింటి వివరాలు అడిగి తెలుసుకున్నారని పార్టీ నేతలు తెలిపారు.

modi
modi
author img

By

Published : Jul 3, 2022, 4:22 PM IST

తెలంగాణలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ సహా ఇతర ప్రతినిధులకు తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మ తెలంగాణ వంటకాలను సిద్ధం చేశారు. ఈ వంటకాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించి రుచి చూశారు. ఏమేం వడ్డిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వంటకాల గురించి ప్రతినిధులు ప్రధానికి వివరించారు.

modi
modi

శనివారం యాదమ్మ బృందం నోవాటెల్​కు చేరుకున్నప్పటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ప్రధాని మోదీ మూడుసార్లు డైనింగ్​హాల్​ను సందర్శించి.. కొన్ని వంటలు రుచి చూశారని.. మరికొన్నింటి వివరాలు అడిగి తెలుసుకున్నారని పార్టీ నేతలు తెలిపారు. భాజపా కార్యవర్గ సమావేశాల కోసం వచ్చిన దాదాపు 1,500 మందికి గత మూడు రోజులుగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వంటకాలను వడ్డిస్తున్నట్లు తెలిపారు.

అవన్నీ వదంతులే.. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆ పార్టీ దిగ్గజాలకు తెలంగాణ వంటకాలను తన చేతితో వండి వడ్డించే అవకాశం రావడం తన అదృష్టమని యాదమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన బండి సంజయ్‌కు రుణపడి ఉంటానన్నారు. మరోపక్క తనను నోవాటెల్​లోకి అనుమతించలేదని సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని యాదమ్మ తెలిపారు. అవన్ని వదంతులని తనను ఎవ్వరూ అడ్డుకోలేదని.. సాదరంగా ఆహ్వానించారని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.