మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక వసతులతో కూడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించడానికి కార్యాచరణ రూపొందించాలని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ.. అధికారులను సూచించారు. రిజిస్ట్రేషన్ల పరంగా ప్రీమియం సేవలు అందించేందుకు ఎంపిక చేసిన నగరాల్లో ఆధునిక వసతులతో కూడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో కార్యాలయాలను ప్రారంభించాలని ఆదేశించారు.
మరోవైపు రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి ప్రయత్నించాలని రజత్ భార్గవ ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌శాఖ పనితీరులో పారదర్శకత, అవినీతి నిర్మూలనపై దృష్టిసారించాలని తెలిపారు. గత కొన్నేళ్లుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి తీసుకున్న చర్యలను న్యాయస్థానాలకు నివేదించాలని సూచించారు. న్యాయ వివాదాలను పరిష్కరించి ఖాళీలను భర్తీ చేయాలని, పదోన్నతి వదులుకున్న సిబ్బంది తప్పనిసరిగా వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శాఖ పనితీరులో పారదర్శకత, అవినీతి నిర్మూలన పై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: