ETV Bharat / city

దుకాణాలు తెరుస్తున్నారా.. ఇవి పాటిస్తే మేలు! - కరోనా తాజా వార్తలు

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 57 రోజుల తర్వాత హైదరాబాద్ లో నగరంలో దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మార్చి 22న జనతాకర్ఫ్యూ మొదలుకుని నగరంలో దుకాణాలు మూతబడ్డాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో సరి-బేసి విధానంలో షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దాదాపు అన్నిరకాల వ్యాపార సంస్థలు కార్యకలాపాలకు సిద్ధమయ్యాయి.

Precautionary measures to be taken before opening stores
దుకాణాలు తెరిచే ముందు పాటించాల్సిన నియమాలు
author img

By

Published : May 20, 2020, 12:30 PM IST

57 రోజుల తర్వాత ఒక్కసారిగా దుకాణాలు తెరిచిన సందర్భంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దుకాణాల్లోకి గాలి, వెలుతురు రాక కార్బన్‌ మోనాక్సైడ్‌, పెట్రోలియం వాయువులతోపాటు సూక్ష్మ, అతిసూక్ష్మ ధూళికణాలు పేరుకుని ఉంటాయి. వస్త్ర, టైర్ల దుకాణాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువ ఉంటుంది. ధూళి కణాలతో శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే దుకాణాల షట్టర్‌ కొంత తెరిచి గంటపాటు వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు..

  • వ్యాపారులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని జేఎన్‌టీయూ సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ విభాగం ఆచార్యుడు ఎం.అంజిరెడ్డి వివరించారు.
  • విద్యుత్తు వ్యవస్థను క్షుణ్నంగా తనిఖీ చేయాలి.
  • ప్రతి వస్తువుపై దుమ్ము, ధూళి కణాలు పేరుకుని ఉంటాయి. ప్రతిదీ శుభ్రం చేసుకోవాలి.
  • వస్తువులు పాడవ్వకుండా డిసిన్ఫెక్టెంట్‌ పిచికారీ చేయించాలి. పరిసరాల్లో బ్లీచింగ్‌ లేదా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం చల్లించాలి.
  • కొన్ని దుకాణాలలో నీటి లీకేజీ కారణంగా దుమ్ముతో కలిసి ఫ్లోర్‌, గోడలు జిగురుగా మారతాయి. వీటిల్లో వైరస్‌, బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతాయి. ఆయా ప్రదేశాల్లో తడి లేకుండా శుభ్రం చేయాలి.
  • దుకాణం తెరిచే సమయంలో తప్పకుండా ముక్కు, నోటికీ మాస్కు పెట్టుకోవాలి. లేదా వస్త్రం కట్టుకోవాలి. తలకు రుమాలు చుట్టుకుంటే మంచిది.
  • కొందరు టీ పెట్టుకునేందుకు కిరోసిన్‌ లేదా గ్యాస్‌ స్టవ్‌లు దుకాణాల్లో పెట్టుకుని వదిలేసి ఉంటారు. వాటిని తనిఖీ చేసుకుని వినియోగించాలి.
  • కొనుగోలుదారులు తప్పనిసరిగా మాస్కుతోనే వచ్చేలా చూడాలి.

ఇదీ చదవండి:

కార్మికులకు ఇది కష్టకాలం- సర్కారే ఆదుకోవాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.