విధి నిర్వహణలో ధైర్యసాహసాలను ప్రదర్శించడంతో పాటు అత్యున్నత సేవలందించిన పోలీసులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 14 మందికి ప్రతిభా పురస్కారాలు, 11 మందికి శౌర్య (గ్యాలెంటరీ) పతకాలు దక్కాయి.
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
నలగట్ల సుధాకర్‌రెడ్డి (సబ్ డివిజనల్ పోలీసు అధికారి, చిత్తూరు), పి. సీతారాం (కమాండెంట్, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ కార్యాలయం, హైదరాబాద్).
పోలీసు ప్రతిభా పురస్కారాలు
కె.రఘువీర్‌రెడ్డి (ఏఎస్పీ, ఇంటెలిజెన్స్, రాజమహేంద్రవరం), కె.సదాశివ వెంకటసుబ్బారెడ్డి (ఏఎస్పీ, ఆర్వీఈవో, ఒంగోలు), కె.నవీన్ కుమార్ (ఏఎస్పీ, అదనపు డీఐఆర్‌ఈ కార్యాలయం, హైదరాబాద్), వట్టికుంట వెంకటేశ్వర నాయుడు (అసిస్టెంట్ కమిషనరు, దిశ పోలీసు స్టేషన్, విజయవాడ), చింతపల్లి రవికాంత్ (అసిస్టెంట్ కమిషనరు, సిటీ స్పెషల్ బ్రాంచ్, విజయవాడ), వెంకటప్ప పెద్ద హనుమంతు (అసిస్టెంట్ కమాండెంట్, ఏపీఎస్పీ 16వ బెటాలియన్, మంగళగిరి), జి.రవికుమార్ (డీఎస్పీ, సీఐడీ, తిరుపతి), కడిమిచెర్ల వెంకటరాజారావు (డీఎస్పీ, పీటీవో, మంగళగిరి), జరుగు శ్రీనివాసులురెడ్డి (సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్, నెల్లూరు టౌన్), బోళ్ల గుణ రాము (ఇన్‌స్పెక్టర్, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజయవాడ), మద్ది కోటేశ్వరరావు (ఎస్సై, సెంట్రల్ క్రైం స్టేషన్, శ్రీకాకుళం), మేడిద వెంకటేశ్వర్లు (అసిస్టెంట్ రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్, డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వు, నెల్లూరు), రమావత్ రామనాథం (ఆర్మ్‌డ్ అసిస్టెంట్ రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్, సీఎస్‌డబ్ల్యూ, విజయవాడ), ఎర్వ శివశంకర్‌రెడ్డి (అసిస్టెంట్ రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్, తొమ్మిదో బెటాలియన్ ఏపీఎస్పీ, వెంకటగిరి).
* వీరితోపాటు కేంద్ర సర్వీసులో పని చేసే రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరికీ పోలీసు ప్రతిభా పురస్కారాలు దక్కాయి. వారిలో.. మద్దాలి రాజ్ కుమార్ (అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-2), కొల్లూరు సత్య హరప్రసాద్(గుంటూరు, రైల్వే) ఉన్నారు.
పోలీసు శౌర్య పతకాలు
ఎస్.బుచ్చిరాజు (జేసీ), జి.హరిబాబు (జేసీ), ఆర్.రాజశేఖర్ (డీఏసీ), డి.మాబాషా (ఏఏసీ), బి.చక్రధర్ (జేసీ), కె.పాపి నాయుడు (ఎస్సై), సాయి గణేష్ (డీఏసీ), ఎం.మునేశ్వరరావు (ఎస్సీ), ఎం.నాని (జేసీ), పి.అనిల్ కుమార్ (జేసీ), టి.కేశవరావు (హెచ్‌సీ).
రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు (అగ్నిమాపకశాఖ)
మాణిక్యం గురుస్వామి నాయుడు (స్టేషన్ ఆఫీసర్), జువ్వలకంటి నాగేశ్వరరావు (లీడింగ్ ఫైర్‌మెన్).
ఇదీ చదవండి:
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేతులు తడిపితేనే పనయ్యేది..!