ETV Bharat / city

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన ప్రశాంత్ కిషోర్ - cm jagan meet prashanth kishore

ముఖ్యమంత్రి జగన్‌తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.

prashanth kishore meet cm jagan
ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన ప్రశాంత్ కిషోర్
author img

By

Published : Jan 8, 2021, 4:42 PM IST

Updated : Jan 8, 2021, 6:48 PM IST

ఏప్రిల్ లేదా మేలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిన వేళ.. సీఎం జగన్​ను వైకాపా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో సీఎంతో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్​.. నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత్ కిషోర్​తో సీఎం జగన్ ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం.

వైకాపాకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ వైకాపాను అధికారంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ముందు కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్​ కిషోర్.. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం తన సొంత రాష్ట్రం బిహార్​లో కార్యకలాపాలపై దృష్టి పెట్టారు.

ఎన్నికల వ్యూహంపై చర్చ..!

రాష్ట్రంలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం కొనసాగుతుండటం.. రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా, తెదేపా సహా ఇతర రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తోన్న పరిణామాలు జరుగుతున్నాయి. వీటితో పాటు వచ్చే ఏప్రిల్​లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున.. ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే విషయంపై సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు.. సహా అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించి వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం.

సార్వత్రిక ఎన్నికల ముందు చాలా బాగా పనిచేసిన వైకాపా సోషల్ మీడియా తదనంతరం అంతగా ప్రభావితంగా పనిచేయడం లేదని.. బలోపేతం చేయాలని సూచించినట్లు సమాచారం. సుమారు రెండు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగినట్లు తెలిసింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించేందుకు తన సహకారం అందిస్తానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: ఎన్నికల సంఘాన్ని కలిసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం

Last Updated : Jan 8, 2021, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.