దేవాదాయశాఖ, కమిషనర్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులపై సిద్ధంచేసిన నివేదికలో సరైన వివరాలు చూపలేదనే విమర్శలు వస్తున్నాయి. ఆ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అన్ని ఆలయాల ఈవోలు, ఉన్నతాధికారులతో మంగళ, బుధవారాల్లో 18 అంశాలపై రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దీనికోసం ఖాళీలపై అధికారులు ఓ నివేదిక సిద్ధం చేశారు.
రాష్ట్రంలో 8 ఉప కమిషనర్ (డీసీ) పోస్టులు ఉన్నాయి. 7 ప్రధాన ఆలయాల్లో జాయింట్ కమిషనర్ క్యాడర్‌లో ఉండే ఈవోలకు సహాయకులుగా గతంలో డిప్యూటీ ఈవోలను నియమించారు. వీరిని ఉప కమిషనర్ క్యాడర్‌గా గుర్తించాలని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే, ఆమోదం లభించలేదు. అయితే తాజాగా సిద్ధంచేసిన జాబితాలో మొత్తం 15 ఉప కమిషనర్ పోస్టులు ఉన్నాయని, ఇందులో ఒక పోస్టులో రెగ్యులర్ డీసీ ఉండగా, మిగిలినవి ఖాళీగా ఉన్నట్లు చూపారు.
సాధారణంగా ఏదైనా శాఖలో పై క్యాడర్ పోస్టులు తక్కువ.. ఆ కింద పోస్టులు ఎక్కువ ఉంటాయి. దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 23 చూపగా, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 30 చూపారు. రాష్ట్ర విభజన సమయంలో వాస్తవం కంటే సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అదనంగా చూపడంతో.. ఇప్పుడు అవి ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.
ఇదీ చదవండి: 'దేవదాయ ట్రైబ్యునల్‌కు ఛైర్మన్‌ను నియమించండి'