ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల ఫోన్ల వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఫోన్ల వినియోగం చట్టవిరుద్ధమని.. ఫోన్ల ద్వారా ఓటర్లపై ఒత్తిడి తెచ్చే అవకాశముందని ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని ఎస్ఈసీ ఆదేశాలు ఉన్నాయని.. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా పడింది.
ఇదీ చదవండి: ప్రత్యర్థులు గెలిచిన చోట వాలంటీర్ల తొలగింపు!