ETV Bharat / city

All Exams Postpone in ts : ఈ నెల 30 వరకు పరీక్షలన్నీ వాయిదా..

All Exams Postpone in ts : తెలంగాణ కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రాక్టికల్స్, రాత, మిడ్ పరీక్షలన్నీ వాయిదా వేయాలని వర్సిటీలకు ఉన్నతావిద్యామండలి ఆదేశాలు జారీ చేసింది.

Exams
Exams
author img

By

Published : Jan 17, 2022, 6:42 PM IST

All Exams Postpone in ts : తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతవిద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైద్య కశాలలకు మినహా విద్యా సంస్థలన్నింటికీ సెలవులు పొడిగించిన నేపథ్యంలో పరీక్షలన్నీ వాయిదా వేయాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఈ నెల 30 వరకు ప్రాక్టికల్స్, రాత, మిడ్ పరీక్షలన్నీ వాయిదా వేయాలని వర్సిటీలకు ఉన్నతావిద్యామండలి ఆదేశాలు జారీ చేసింది.

ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు అన్ని యూనివర్సిటీలు తమ పరిధిలోని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, శాతవాహన, అంబేడ్కర్ యూనివర్సిటీలు వివిధ పరీక్షలను వాయిదా వేశాయి. మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు విశ్వవిద్యాలయాలు వెల్లడించాయి. సెలవుల్లో పరీక్షలను నిర్వహిస్తే.. వాటిని పరిగణనలోకి తీసుకోబోమని ప్రైవేట్ కళాశాలలకు జేఎన్టీయూహెచ్​ స్పష్టం చేసింది. ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ ఆన్​లైన్​లో బోధన కొనసాగిస్తున్నాయి.

ఇదీ చూడండి:

విద్యాసంస్థలు తెరిచాం.. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు: సురేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.