ETV Bharat / city

కింజరాపు వారసుడిగా ఎంట్రీ... అచ్చెన్న రాజకీయ ప్రస్థానం ఇదే..! - ఏపీ తెదేపా అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు తాజా వార్తలు

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడిని అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పార్టీ క‌మిటీల‌ను ప్రక్షాళ‌న చేసి కొత్త వారికి అవ‌కాశం కల్పిస్తూ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయి కమిటీని ప్రకటించిన చంద్రబాబు... ఏపీకి మాత్రం అధ్యక్షుడిని మాత్రమే ఖరారు చేశారు. పొలిట్ బ్యూరోలో కొత్తవారికి అవకాశం కల్పించగా... ముగ్గురు మహిళలకు జాతీయ ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించారు.

tdp ap president atchannaidu
tdp ap president atchannaidu
author img

By

Published : Oct 19, 2020, 5:33 PM IST

తెలుగుదేశం పార్టీ వివిధ కమిటీల కార్యవర్గాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆయన ఇది వరకే పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్‌ నాయకుల అభిప్రాయం తెలుసుకున్నారు. అచ్చెన్న ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు, బీసీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనను అధ్యక్షుడిగా నియమించడం పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందన్న అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమైనట్టు సమాచారం.

ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని నడిపించాలంటే అచ్చెన్నాయుడు లాంటి దూకుడు నేత అయితేనే సబబనే అభిప్రాయం అధిక శాతం మంది వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీలో సీనియర్ నేతలు, క్యాడర్, యువ నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ఈ నియామకానికి అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడికి అవకాశం ఇవ్వటం ద్వారా తెలుగుదేశం బీసీల పార్టీ అనే సంకేతాన్ని బలంగా పంపొచ్చన్నది అధినేత యోచనగా తెలుస్తోంది.

చంద్రబాబు వెంటే కింజరాపు కుటుంబం...

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం చరిత్రలో కింజరాపు కుటుంబం కీలక పాత్ర పోషించింది. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన దగ్గరనుంచి ఆయనకు కుడిభుజంగా ఎర్రన్నాయుడు వ్యవహరించారు. దిల్లీ వ్యవహారాలు మొత్తం ఆయనే చూసేవారు. యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చంద్రబాబు దిల్లీలో చక్రం తిప్పిన రోజుల్లో అంతా ఎర్రన్నాయుడు ద్వారానే అక్కడ రాజకీయాలు నడిచాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఆయన మరణం తర్వాత అచ్చెన్నాయుడు కూడా అదే స్థాయిలో చంద్రబాబుకి నమ్మినబంటుగా ఉన్నారు. మంత్రిగా పని చేసిన సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్, వైకాపా నేతలు చేసిన విమర్శలపై దీటైన సమాధానం ఇస్తూ పూర్తి స్థాయి అధిపత్యం ప్రదర్శించేవారు. పార్టీ ఓటమి తర్వాత అసెంబ్లీలో టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడు... చంద్రబాబుకి పూర్తిగా అండగా నిలిచారు. దీంతో ముఖ్యమంత్రి నుంచి అధికారపార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అంతా అచ్చెన్నాయుడినే సభలో లక్ష్యంగా చేసుకున్నారు. ఒకానొక దశలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు కూడా ఏపీ అధ్యక్ష పదవికి పరిశీలించారు. కానీ చిన్న వయసు అవ్వటంతొ సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో దానిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు ఐదోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

1996లో రాజకీయ ప్రవేశం...

1996 ఉపఎన్నిక ద్వారా రాజకీయాలలో అచ్చెన్న ప్రవేశించారు. తన సోదరుడు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం నుంచి పార్లమెంటుకి ఎన్నికవటంతో హరిశ్చంద్రపురం స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన వారసుడుగా సోదరుడు అచ్చెన్నాయుడు రాజకీయాల్లో ప్రవేశించారు. తర్వాత 1999, 2004 ఎన్నికల్లో హరిచంద్రపురం నుంచి 2014, 2019 టెక్కలి అసెంబ్లీ నుంచి ఆయన విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హరిచంద్రపురం రద్దు అవ్వటంతో అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వీరి కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా, ఎర్రన్నాయుడు కుమార్తె భవాని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా, రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా కొనసాగుతున్నారు. ఆదిరెడ్డి భవాని భర్త వాసుని.. తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించాలని అనుకున్నప్పటికీ అచ్చెన్న నియామకం ప్రభావం దానిపై పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. పార్టీ నేతలతో చాలా సమన్వయంగా కళా పని చేశారని చంద్రబాబు పలు సందర్భాలలో కితాబిచ్చారు.

ఇదీ చదవండి

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్న.. పొలిట్ బ్యూరోలోకి బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.