ETV Bharat / city

కిడ్నాప్​ ప్లాన్​ ఎవరిది.. అప్పుడు అఖిలప్రియ ఎక్కడున్నారు? - praveen rao kidnap case updates

ప్రవీణ్​రావు సోదరుల అపహరణ కేసులో అఖిలప్రియను.. పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో అఖిలప్రియ ఎక్కడున్నారు.. అవహరణకు పథకం ఎవరు రచించారనే కోణంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బేగంపేట మహిళా పోలీస్​స్టేషన్​లో విచారణ సాగుతోంది.

కిడ్నాప్​ ప్లాన్​ ఎవరిది.. అప్పుడు అఖిలప్రియ ఎక్కడున్నారు?

author img

By

Published : Jan 12, 2021, 5:25 PM IST

బోయిన్​పల్లి అపహరణ కేసులో అఖిలప్రియను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. బేగంపేట మహిళా పోలీస్​స్టేషన్​లో వివిధ అంశాలపై ఆరా తీసున్నారు. ఆమె తరఫు న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నిస్తున్నారు.

అపహరణ జరిగిన సమయంలో అఖిలప్రియ ఎక్కడున్నారు.. పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవరామ్​ ఎక్కడున్నారు.. అపహరణకు పథకం ఎవరు రచించారు.. తదితర అంశాలపై విచారణ జరుపుతున్నారు.

ఈ కిడ్నాప్​ కేసులో ఏ-3గా ఉన్న భార్గవరామ్​ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అతని ఆచూకీ లభమైతే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బోయిన్​పల్లిలో ప్రవీణ్​రావు సోదరుల అపహరణ కేసులో ఏ-1గా అఖిలప్రియ, ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-3గా భార్గవరామ్​ ఉన్నారు.

ఇవీచూడండి: పోలీసుల కస్టడీలో అఖిలప్రియ.. బేగంపేట మహిళా ఠాణాకు తరలింపు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురు అరెస్టు

హఫీజ్‌పేట భూములు మావే: అఖిలప్రియ సోదరుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.