ETV Bharat / city

సికింద్రాబాద్​ తరహాలో ప్లాన్​.. లాఠీఛార్జ్​తో అడ్డుకున్న పోలీసులు - వరంగల్ రైల్వేస్టేషన్​

warangal police at railway station: సికింద్రాబాద్ తరహాలోనే వరంగల్ రైల్వేస్టేషన్​లోనూ ఆందోళనకు యత్నించిన నిరసనకారులను పోలీసులు సకాలంలో అడ్డుకున్నారు. ఒక్కసారిగా చొచ్చుకొచ్చిన ఆందోళనకారులను పోలీసులు లాఠీఛార్జ్ చేసి నియంత్రించారు.

warangal police at railway station
సికింద్రాబాద్​ తరహాలో ప్లాన్
author img

By

Published : Jun 18, 2022, 5:29 PM IST

warangal police at railway station: వరంగల్‌ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిన్న ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేసిన తీరుగానే ఇవాళ వరంగల్​లో అందోళనకారులు రైల్వేస్టేషన్​ లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. ముందస్తు సమాచారంతో సిద్ధంగా ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అందోళనకారులకు తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు.

సికింద్రాబాద్​ తరహాలో ప్లాన్

అనంతరం అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ ఎదుట అందోళనకారులు ధర్నాకు దిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. నిన్న సికింద్రాబాద్​లో జరిగిన అల్లర్లలో పోలీసులు కాల్పులు జరపగా రాకేశ్ అనే యువకుడు మృతి చెందాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.