ETV Bharat / city

CHANDRABABU: చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తతలపై కేసులు నమోదు - చంద్రబాబు న్యూస్ అప్​డేట్స్

babu house issue
babu house issue
author img

By

Published : Sep 18, 2021, 11:08 AM IST

Updated : Sep 18, 2021, 12:18 PM IST

11:06 September 18

చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనలపై కేసుల నమోదు

చంద్రబాబు నివాసం వద్ద దాడి ఘటనకు సంబంధించి.. పోలీసులు తెదేపా నేతలపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నకరికల్లు పోలీస్ స్టేషన్​లో పలు సెక్షన్​ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ కారు ధ్వంసం ఘటనకు సంబంధించి తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంపై నాలుగు సెక్షన్​ల కింద కేసులు నమోదు చేశారు. తెదేపా కార్యకర్తలు, నేతలు గత రాత్రి నుంచి ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తాము ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా.. తమపైనే కేసులు పెట్టడాన్ని తెదేపా నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్​పై చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్​లో తెదేపా శ్రేణులు ఫిర్యాదు చేశారు. కుట్ర పూరితంగా చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించిన జోగి రమేష్​ను అరెస్టు చేయాలని పార్టీ నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేవలం మంత్రి పదవి కోసం తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబుపై దాడి చేసేందుకు యత్నించడం దుర్మార్గమని పార్టీ నాయకులు ఖండించారు. పోలీసులు న్యాయబద్దంగా విచారణ చేసి దాడిని అడ్డుకున్న తెదేపా శ్రేణులను గాయపరిచిన, జోగి రమేష్, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:  నేడు గవర్నర్​ను కలవనున్న తెదేపా నేతలు..తాజా పరిణామాలపై ఫిర్యాదు

Last Updated : Sep 18, 2021, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.