దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలను ఏపీ సీఎస్ నీలం సాహ్ని గుర్తు చేసుకున్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ ఉత్సవాల్లో భాగంగా విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన పోలీస్ బ్యాండ్ డిస్ ప్లే కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు కొవిడ్ సమయంలో ఉత్తమ సేవలందించారని తెలిపారు. దేశభక్తి గీతాలను ఏపీ పోలీస్ బ్యాండ్ చక్కగా డిస్ ప్లే చేశారని కొనియాడారు.
పోలీసుల టెక్నాలజీ వినియోగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని డీజీపి గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ ఏడాది మొత్తం 103 జాతీయస్థాయి అవార్డులు దక్కటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు విధి నిర్వహణలో ఉన్న ప్రతీ పోలీసు మదిలో ఉండిపోతాయన్నారు.
అమరవీరులకు మౌనం పాటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కొవిడ్ సమయంలో పోలీసులతో పాటు ముందుండి సేవలందిస్తున్న మున్సిపల్, రెవెన్యూ, ఆరోగ్య శాఖలకు మెమెంటోలను అందజేశారు. ఏపీ పోలీస్ బ్యాండ్ లో హిందీ, తెలుగు బాషల్లో దేశభక్తి గీతాలను చక్కగా ప్రదర్శించారు.
ఇదీ చదవండి: