ETV Bharat / city

కాఫర్​ డ్యాం నిర్మాణంలో ఆలస్యం.. పోలవరానికి వరద సవాలు - పోలవరం ప్రాజెక్టు

Polavaram: పోలవరం ప్రాజెక్టుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. గోదావరి వరద ముంచెత్తుతున్న నేపథ్యంలో వరద ఇంకొంచెం పెరిగితే నీరు ఎగువ కాఫర్‌ డ్యాంవైపు ఎగదన్నే సమస్య ఉంది. ఈ సవాలును ఎలా ఎదుర్కోవాలా అని అధికారులు మళ్లీ తర్జనభర్జన పడుతున్నారు.

పోలవరం
పోలవరం
author img

By

Published : Jul 10, 2022, 5:21 AM IST

Updated : Jul 10, 2022, 9:49 AM IST

కాఫర్​ డ్యాం నిర్మాణంలో ఆలస్యం.. పోలవరానికి వరద సవాలు

Flood at Polavaram: గోదావరిలో వరద పెరుగుతుండటంతో పోలవరంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మూడేళ్ల క్రితం ప్రారంభించిన దిగువ కాఫర్‌ డ్యాం పనులు ఇంకా పూర్తికాలేదు. ఈ మూడేళ్లలోనే నిర్మాణానికి అనేక గడువులు మారుతూ వచ్చాయి. 2020 వరద సీజన్‌ కన్నా ముందే ఈ డ్యాంను పూర్తిచేయాలని అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు సూచించినా, ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. జులై వరదల నాటికి దాన్ని 30.5 మీటర్ల స్థాయికి నిర్మించి రక్షిత స్థాయికి తేవాలనుకున్నా.. 19 మీటర్ల స్థాయికే పూర్తి చేయగలిగారు. ఈలోగా గోదావరికి వరద ప్రవాహాలు పెరిగాయి. పోలవరం స్పిల్‌వే వద్ద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో దిగువ కాఫర్‌ డ్యాంవైపు బ్యాక్‌వాటర్‌ వేగంగా వస్తోంది. వరద మరింత పెరిగితే దీనిపై నుంచి నీరు ఎగువ కాఫర్‌ డ్యాంవైపు ఎగదన్నే సమస్య ఉంది. ఈ సవాలును ఎలా ఎదుర్కోవాలా అని అధికారులు మళ్లీ తర్జనభర్జన పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ శనివారం జల వనరులశాఖ, ప్రాజెక్టు అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. స్పిల్‌ వే గేట్లన్నింటినీ తాత్కాలికంగా మూసి జలాశయంలో నీరు నిల్వ చేయాలని చర్చ జరిగింది. స్పిల్‌ వే వద్ద 32 మీటర్ల స్థాయికి వరద వచ్చేవరకూ గేట్లు మూసి ఉంచాలని కొందరు ప్రతిపాదించారు.

వరద ఆ స్థాయికి వచ్చేలోపు దిగువ కాఫర్‌ డ్యాం ఎత్తును మరింత పెంచవచ్చని, అది కొంతమేర రక్షణ ఇస్తుందని ఆలోచించారు. అథారిటీ సమావేశం జరిగే సమయానికి పోలవరం వద్ద 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలే ఉంటాయనే అంచనాతో ఈ ఆలోచన చేశారు. కానీ, సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. ప్రవాహాలు 5 లక్షల క్యూసెక్కులకు చేరుకుంటున్నాయి. పోలవరం స్పిల్‌వే వద్ద వరద 29 మీటర్ల స్థాయికి చేరుకోవచ్చని సమాచారం. గేట్లు మూసేస్తే కొద్దిగంటల్లోనే అది 32, 33 మీటర్ల స్థాయికి చేరుకుంటుందనే అంచనాకు వచ్చారు. దీంతో పోలవరం స్పిల్‌ వే గేట్లు మూసి, వరదను నిలువరించి దిగువ కాఫర్‌ డ్యాం వద్ద రక్షణ చర్యలు చేపట్టవచ్చన్న ప్రతిపాదనకు శనివారం సాయంత్రానికే అవకాశం లేకుండా పోయింది.

ఎగువ నుంచి జోరుగా ప్రవాహాలు..: ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరిలోకి జోరుగా ప్రవాహాలు వస్తున్నాయి. మేడిగడ్డ వద్ద బ్యారేజి తలుపులు అన్నీ ఎత్తి 4 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని శనివారం దిగువకు వదిలారు. గోదావరి పరీవాహకంలో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆ వరద అంతా పోలవరానికే చేరుతుంది. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌తో కూడా అధికారులు మాట్లాడారు. ఎగువ నుంచి ప్రవాహాలు ఎక్కువే ఉన్నాయని ఆయన చెప్పడంతో.. పోలవరం స్పిల్‌ వే గేట్లు తాత్కాలికంగా మూసి పనులు చేయాలనే ఆలోచనకు అవకాశం లేకుండా పోయింది.

పునరావాస సమస్యలు: పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు వీలుగా పునరావాసం పనులను ఎప్పుడో పూర్తిచేయాల్సి ఉన్నా.. ఇంకా వందల కుటుంబాలను తరలించలేదు. పోలవరం వద్ద గోదావరి వరద పెరుగుతోంది. ఎగువ కాఫర్‌ డ్యాం 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించడంతో స్పిల్‌ వే మీదుగా నీటిని వదిలేసినా ఎగువ కాఫర్‌ డ్యాం ప్రభావం వెనక్కి కనిపిస్తోంది. పునరావాస కాలనీల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. నిర్వాసితులను పూర్తిస్థాయిలో తరలించకపోవడంతో అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఉంది.

కాఫర్‌ డ్యాం నిర్మాణంలో ఆలస్యంతోనే.. : దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంలో వేసవిని సరిగా ఉపయోగించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. చేయాల్సినంత వేగంతో పనులు చేయలేదని కొందరు పోలవరం ఇంజినీర్లే అనధికారికంగా విమర్శిస్తున్నారు.

  • వరద వెనక్కి ఎగదన్ని 19 మీటర్ల ఎత్తు పైనుంచి కూడా ప్రవహిస్తే ఎలాగన్న అంశంపై చర్చ సాగుతోంది. రక్షణ ఏర్పాట్లపై పరిశీలిస్తున్నారు.
  • ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంపై నీరు చేరితే మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. అక్కడ ఇప్పటికే కోత పడ్డచోట ఇసుక నింపి, దాన్ని గట్టిపరిచే ప్రయత్నాలు చేశారు.
  • డయాఫ్రం వాల్‌ ఇప్పటికే కొంత ధ్వంసమయింది. దాని అధ్యయనానికి నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ నిపుణులు కొన్ని మార్గాలు సూచించారు. వరద నీరు ఎగువకు ప్రవహిస్తే వారు సూచించిన పరీక్షలు చేయడమెలాగన్న చర్చ కూడా సాగుతోంది.

ఇదీ చూడండి :

Last Updated : Jul 10, 2022, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.