ETV Bharat / city

తెలంగాణ : పుట్టెడు దుఃఖంతో సావాసం... నిత్యం కష్టాలతో పోరాటం - ఆరుగురు కుటుంబ సభ్యుల్లో ఐదుగురు దివ్యాంగులే\

ఆ ఇంటిని చూస్తే కష్టమే కన్నీరు పెట్టుకుంటుంది. ఆరుగురు కుటుంబ సభ్యుల్లో ఐదుగురు దివ్యాంగులే. సాయం లేకుండా కనీసం మంచి నీళ్లు తాగలేరు. ఇంతమందికి అండగా నిలుస్తోంది ఒక అమ్మాయి మాత్రమే. కన్నోళ్లకు.. తోడ పుట్టినోళ్లకు అమ్మగా మారి సేవలు చేస్తోంది. అంగవైకల్యంతో దశాబ్దాలుగా బతుకులు వెళ్లదీస్తున్న ఆ కుటుంబం భారం మోస్తోంది చిట్టితల్లి.

physically-handicapped-family-story-in-medak
పుట్టుకతోనే కాళ్లు, చేతులు వంకర్లు
author img

By

Published : Aug 13, 2020, 11:48 AM IST

పుట్టుకతోనే కాళ్లు, చేతులు వంకర్లు

తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన పెంటమ్మ, బూదమ్మ, సత్తెమ్మ జన్యు సమస్యలతో జన్మించారు. పుట్టుకతోనే కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి దివ్యాంగులయ్యారు. తల్లిదండ్రులు వీరిని కంటికి రెప్పాలా కాపాడుకునే వారు. పెళ్లి చేసుకుని ముగ్గురు అక్కాచెల్లెలను చూసుకుంటానని సమీప బంధువు నమ్మించాడు. తీరా వివాహం అనంతరం వారికి పిల్లలు ఆరోగ్య సమస్యలతో పుట్టగా.. అండగా ఉంటానని చెప్పినవాడు వదిలేసి పారిపోయాడు.

  • ఒక్క పూటే తింటూ...

వృద్ధాప్యంతో తల్లిదండ్రులు చనిపోవడం.. భర్త వదిలేసి వెళ్లగా అసరా లేకుండా పోయింది. వీరి ముగ్గురు సంతానంలో ఒకరు మాత్రమే పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కుమారుడు చంద్రశేఖర్ తల్లిలాగే అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. మరో కొడుకు రాజుకు రేచీకటి, వినికిడి సమస్యలు ఉన్నాయి. ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక పూట తింటూ.. పస్తులు ఉంటూ క్షణమొక యుగంలా కాలం వెళ్లదీస్తున్నారు.

  • ఐదుగురికి అమ్మగా మారిన భాగ్యలక్ష్మి...

ఈ ఐదుగురు దివ్యాంగులకు భాగ్యలక్ష్మి అమ్మగా మారింది. తల్లిని.. ఆమె తోబుట్టువులు.. తన సోదరులకు అన్నీతానై.. కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. వాళ్లందరి కోసం తన చదువును సైతం త్యాగం చేసింది. ప్రస్తుతం ఈ కుటుంబం శిథిలావస్థకు చేరిన ఇంటిలో నివాసం ఉంటున్నారు. వర్షానికి గోడలు, ఇల్లు నిమ్ము పట్టి ఎప్పుడు కూలుతుందో తెలియదు. భయంతో.. బిక్కు బిక్కుమంటూ అందులోనే ఉంటున్నారు.

  • సాయం కోసం ఎదురుచూపు...

ఈ కుటుంబం దీనస్థితి తెలుసుకున్న బీడీఎల్​ భానూర్ ఉద్యోగులు సేవా సంస్థ విన్నర్ ఫౌండేషన్ ద్వారా అండగా నిలుస్తున్నారు. నిత్యవసరాలతో పాటు మెరుగైన వైద్యం అందించేందుకు.. నిమ్స్‌లో జన్యు పరీక్షలు చేయించారు. దాతల సాయం కోసం ఈ కుటుంబం దీనంగా ఎదురు చూస్తోంది. ఇంటి నిర్మాణంతో పాటు ఉపాధి మార్గం చూపి.. ఆదుకోవాలని వేడుకుంటోంది.

ఇదీ చదవండి :

'మా నాన్న కరోనాతో చనిపోలేదు.. దయచేసి సాయం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.