తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం(2022-23) అనుబంధ గుర్తింపు పొందేందుకు ఇంజినీరింగ్ కళాశాలలు ఉత్తుత్తి అధ్యాపకుల కోసం మళ్లీ వేట కొనసాగిస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి రప్పించే బాధ్యతను కొన్ని కాలేజీలు కన్సల్టెన్సీలకు అప్పగించాయి. దాంతో కన్సల్టెన్సీల సిబ్బంది కళాశాలల్లో పనిచేసి, మానేసి ఇతర వృత్తుల్లోకి వెళ్లిన వారికి ఫోన్లు చేస్తున్నాయి. ఈ తరహా ఫోన్ రికార్డెడ్ వాయిస్‌లు కూడా సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి.
రోజూ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేసి వెళితే నెలకు రూ.15 వేలు ఇస్తామని, జేఎన్‌టీయూహెచ్ తనిఖీల నాడు వస్తే(రెండు సార్లు) రూ.20 వేలు ముట్టజెపుతామని అధ్యాపకులకు ఫోన్లు చేస్తున్నారు. బాచుపల్లిలోని ఓ కళాశాలలో, జేఎన్‌టీయూహెచ్ సమీపంలోని మరో కాలేజీలో ప్రస్తుతం ఇలాంటి అవకాశం ఉందని కన్సల్టెన్సీల సిబ్బంది చెప్పడం గమనార్హం.
ఇవీ చదవండి :
అంకురాల్లో అట్టడుగున ఆంధ్రప్రదేశ్.. అగ్రస్థానంలో తెలంగాణ
పొట్టేళ్లతో వ్యవసాయం.. నాగలితో దున్నడం, బండిని లాగడం అన్నీ వాటితోనే!