తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటవీ అధికారులపై పోడు సాగుదారులు పెట్రోల్ పోశారు. పోడు భూముల్లో మొక్కలు చూసేందుకు వెళ్లిన అటవీ అధికారులపై దాడికి దిగారు. అటవీ రేంజ్ అధికారిణి దివ్య, సిబ్బందిపై పెట్రోల్ పోశారు. తమ భూముల్లో మొక్కలు నాటవద్దంటూ పోడు సాగుదారులు నిరసన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటారు. అధికారులు నాటిన మొక్కలు పోడు సాగుదారులు తొలగించారు. పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లారు.
ఇదీ చదవండి: JAGAN ED CASE : వెంకట్రామిరెడ్డి, రాజగోపాల్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్