ETV Bharat / city

పీఆర్సీ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం - petition filed against prc

పీఆర్సీ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈనెల 17 న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస ఛైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు .

petition on prc in in highcourt
petition on prc in in highcourt
author img

By

Published : Jan 21, 2022, 6:18 AM IST

ఈనెల 17న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస ఛైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతపడుతుందన్నారు. ఆర్థిక అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రభుత్వాలు జీతాలను తగ్గిస్తాయి , కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ జీవో ముసుగులో ఉద్యోగుల జీతాలను తగ్గించారన్నారు. ఏపీ విభజన చట్టానికి జీవో వ్యతిరేకంగా ఉందన్నారు. దానిని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. తమ వినతులను పరిగణనలోకి తీసుకొని కొత్తగా వేతనాలను సవరించేలా ఆదేశించాలని కోరారు. జీవో అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి , రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి , కేంద్ర హోం శాఖ కార్యదర్శి , పే రివిజన్ కమిషన్ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు .

ఏపీ విభజన చట్టంలో హైదరాబాద్​ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించినప్పటికీ పరిపాలనను రాజధాని 2016లో అమరావతికి మార్చారని పిటీషన్​లో తెలిపారు . దీంతో ఉన్నపళంగా కుటుంబాలను హైదరాబాద్​లో వదిలేసి ఉద్యోగులు అమరావతికి మారాల్చివచ్చిందన్నారు. దీంతో మాపై హైదరాబాద్​తో పాటు అమరావతిలో ఇంటి అద్దెల భారం పడిందని తెలిపారు . అకస్మాత్తుగా రాజధాని తరలించడంతో గుంటూరు , విజయవాడల్లో అద్దెలు అసాధారణంగా పెరిగాయన్నారు . ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వం .. ఉద్యోగులకు చెల్లించే మూల వేతనంలో 30 % ఇంటి అద్దె భత్యం ప్రకటించిందని.. అక్కడున్న పరిగణనలోకి తీసుకొని న్యాయబద్ధంగా హెచ్ఎర్ఎ నిర్ణయించాల్సి ఉంటుందన్నారు.

విశ్రాంత ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్ర నేతృత్వంలో 2018లో అప్పటి ప్రభుత్వం పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు . కమిషన్ లేవనెత్తిన అంశాలపై సమగ్ర వివరాలు ఇచ్చామని పిటీషన్ లో తెలిపారు . దురదృష్టవశాత్తు ఆ కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టలేదు. ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు కార్యదర్శులతో ప్రభుత్వం మరో కమిటీ వేసిందన్నారు . ఈ విధంగా కమిటీ వేయడం చట్ట విరుద్ధమన్నారు. పీఆర్సీ కమీషన్ స్థాయిని తక్కువ చేయడమే అవుతుందన్నారు. పీఆర్సీ కమిషన్ నివేదికను కానీ , తదనంతర ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ పరిశీలించిన విషయాలను ప్రభుత్వం బయటపెట్టకుండా ఏకపక్షంగా జీవోను జారీచేసిందని తెలిపారు . సహజ న్యాయసూత్రాలకు , విభజన చట్టానికి విరుద్ధంగా జీవో ఉంది . ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 78 ( 1 ) ప్రకారం ఏపీ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలను స్పష్టం చేస్తోందన్నారు . ఆ సెక్షన్ ప్రకారం ఉద్యోగులు హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చినా సర్వీసు నిబంధనలు , వారి కల్పించే హెచ్ఎర్ఎ , తదితర ప్రయోజనాలకు రక్షణ ఉంటుందన్నారు . ప్రస్తుత పీఆర్సీని 2018 జులై 1 నుంచి అమలవుతుందని పేర్కొనడం ద్వారా .. ఇప్పటి వరకు ఉద్యోగులకు అదనంగా చెల్లించి ఉంటే వాటిని రాబట్టుకునే అధికారం కల్పించడం అసంబద్ధమన్నారు . మేం ఇచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోకుండా వేతన సవరణ ఉత్తర్వులిచ్చారు . ఈ నేపథ్యంలో న్యాయస్థానం జోక్యాన్ని కోరుతున్నాం ' అని పిటిషన్లో పేర్కొన్నారు .

ఇదీ చదవండి: ప్రభుత్వం కీలక నిర్ణయం.. తరగతుల విలీనంపై విద్యాశాఖ ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.