ETV Bharat / city

'ఏ అధికారంతో కొనసాగుతున్నారో వివరణ కోరండి'

author img

By

Published : Sep 26, 2020, 4:07 AM IST

ప్రస్తుతం నిర్వహిస్తున్న పదవులు, పోస్టుల్లో ఏ అధికారంలో కొనసాగుతున్నారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్​ను వివరణ కోరాలనే అభ్యర్థనతో హైకోర్టులో కోవారెంట్ పిటిషన్ దాఖలైంది.

'ఏ అధికారంతో కొనసాగుతున్నారో వివరణ కోరండి'
'ఏ అధికారంతో కొనసాగుతున్నారో వివరణ కోరండి'

వారిని పదవులు, పోస్టులు నిర్వహించకుండా నిలువరించాలని అభ్యర్థిస్తూ గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన ఎ.సుధాకర్ బాబు కోవారెంట్ పిటిషన్​ దాఖలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వకపోవడం దేవాదాయ చట్టంలోని సెక్షన్ 97, 153లకు విరుద్ధమన్నారు. ఆ చట్టంలోని నిబంధన 136, 137 ప్రకారం హిందూయేతరులు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉందన్నారు. డిక్లరేషన్ అవసరం లేదని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, నాని మద్దతు పలికారని పిటిషన్​లో పేర్కొన్నారు. చట్ట నిబంధనలను అమలు చేయడంలో తితిదే ఛైర్మన్, ఈవోలు విఫలమయ్యారని తెలిపారు.

ఇదీ చదవండి: తిరిగిరాని లోకాలకు బాలు.. శోకసంద్రంలో ప్రజానీకం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.