ETV Bharat / city

లెదర్ వద్దంటూ పెటా వినూత్న పద్ధతిలో ప్రచారం.. - Vibhudi Jain a member of PETA

PETA Awareness Campaign: హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​ వద్ద పెటా సభ్యురాలు విభూది జైన్​ విభిన్న వస్త్రధారణతో ప్రచారం నిర్వహించారు. మదర్స్​ డేను పురస్కరించుకుని జంతువుల సంరక్షణ, గో లెదర్​ ఫ్రీ అంశాలపై అవగాహన పెంచేందుకు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు.

ఇందిరాపార్క్​ వద్ద పెటా సభ్యురాలు విభూది జైన్

author img

By

Published : May 6, 2022, 5:27 PM IST

PETA Awareness Campaign: మదర్స్​ డేను పురస్కరించుకుని జంతువుల సంరక్షణ, గో లెదర్​ ఫ్రీపై అవగాహన కోసం పెటా సంస్థ వినూత్న పద్ధతిలో ప్రచార కార్యక్రమం చేపట్టింది. తెలంగాణలోని హైదరాబాద్​ ఇందిరాపార్క్​ వద్ద పెటా సభ్యురాలు విభూది జైన్​.. ఈ ప్రచారాన్ని చేపట్టారు. లెదర్​కు ప్రత్యామ్నాయంగా ఇతర వస్తువులు వాడుకోవచ్చన్న అంశంపై సమాజంలో అవగాహన పెంచేందుకు పెటా కృషి చేస్తోందని విభూది జైన్​ తెలిపారు. లెదర్​ వస్తువుల వాడకం వల్ల ఎన్నో జంతువులు అకారణంగా మరణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రజలందరికి పెటా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లెదర్​ వస్తువులు వాడకండి. వాటి వాడకం వల్ల ఎన్నో మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. ఇలా జంతువులను చంపేస్తూపోవటం ఎంత మాత్రం సమాజానికి మంచిది కాదు. మూగజీవాలను బాధ పెట్టి ఈ లెదర్​ వస్తువులను తయారు చేయటం అమానుషం. ఈ మదర్స్​ డే సందర్భంగా.. జంతువుల సంరక్షణ, గో లెదర్​ ఫ్రీ అంశాల అవగాహన కల్పించేందుకు పెటా సంస్థ తరఫున చాలా పట్టణాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాం." - విభూది జైన్​, పెటా సభ్యురాలు

ఇదీ చూడండి:

ఏడుతోనే బడి బంద్​.. ప్లాస్టిక్, పాలిథీన్​తో పెట్రోల్.. లీటర్​కు 50కి.మీ మైలేజ్!

పెళ్లి కోసం ప్రేయసి పక్కా ప్లాన్​.. ప్రియుడి కండోమ్​కు రంధ్రాలు.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.