ETV Bharat / city

Pesticide Price Hike Issues : భారీగా పెరిగిన పురుగు మందుల ధరలు.. ఆవేదనలో అన్నదాతలు! - Pesticides Price in AP

Pesticide Price Hike Issues : దుక్కి దున్నిన నాటి నుంచి పంట అమ్ముకునే వరకూ రోజుకో సవాల్​తో రైతులు పోరాటం చేయాల్సిందే. తెల్లారితే ఏ సమస్య ముంచుకొస్తుందో తెలియదు. సాగు చేయటం అంటే సవాళ్లకు ఎదురెళ్లటమే అనుకోవాల్సిన రోజులు వచ్చేశాయి. ఉన్న ఇబ్బందులు చాలవన్నట్టు పెట్టుబడులు పెరుగుతున్నాయి. అసలే వ్యవసాయం రోజురోజుకీ భారంగా మారుతున్న వేళ అన్నదాతలపై మరో పిడుగు పడింది. పురుగుమందుల ధరలు పెరగటం వల్ల సాగు, పెట్టుబడులు అధికం కానున్నాయి. ఎరువుల ధరలు పెరిగి సాగు కష్టంగా మారిన తరుణంలో ఇప్పుడు పురుగు మందుల ధరలూ పెరగటం అన్నదాతల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు అప్పులపాలవుతున్న రైతులకు ఇది మరింత భారంగా మారనుంది. ఇంతకీ.. పురుగు మందుల పెరుగుదలకు కారణాలేంటి..? అందులో ప్రభుత్వం వేసే పన్నుల భారమెంత..? ధరలపై నియంత్రణ ఎందుకు లేదు??

Pesticide Price Hike Issues
పెరిగిన పురుగుల మందుల ధరలు..ఆందోళనలో అన్నదాతలు..
author img

By

Published : Jan 5, 2022, 6:32 PM IST

Pesticide Price Hike Issues : ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటు ధరల్లేక సాగురంగం సంక్షోభంలో ఉన్న తరుణంలో అన్నదాతలపై పురుగుమందుల ధరల పెరుగుదల రూపంలో మరోభారం పడింది. పైర్లపై పిచికారీ చేసే పురుగు, తెగుళ్లు, కలుపు మందుల ధరలు 3, 4 నెలల్లోనే 15నుంచి 20% మేర పెరిగాయి. ఫలితంగా.. వివిధరకాల పంటల్లో పెట్టుబడి మరింత పెరిగింది. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి 3,850 టన్నుల మేర రసాయన మందులకు డిమాండు ఉంది. 8 వేల కోట్ల రూపాయలకు పైనే అమ్మకాలు జరుగుతుంటాయని అంచనా. ఈ ప్రకారం చూస్తే ధరల పెరుగుదల కారణంగా రైతులపై ఏటా దాదాపు 1,200 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఖరీఫ్ సీజన్లోనే 50% పైగా ఎరువుల ధరలు పెరగటం వల్ల సాగు ఖర్చు అమాంతం అధికమైంది. దీనికితోడు పురుగుమందుల ధరలు పెరగడం వ్యవసాయంపై పెట్టుబడుల్ని మరింత అధికం చేసింది.

పెరిగిన పురుగుల మందుల ధరలు..ఆందోళనలో అన్నదాతలు..

వాణిజ్య పంటలైన మిరప, పత్తి గతంలో ఎన్నడూ లేని విధంగా తెగుళ్ల బారిన పడ్డాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు విపరీతంగా రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. మిర్చికి మంచి ధర ఉండటం వల్ల ఎంతోకొంత పంట చేతికి అందుతుందన్న ఆశతో సస్యరక్షణ చర్యలు చేపట్టారు. ఇలాంటి తరుణంలో పురుగుమందుల ధరలు పెరగడం అన్నదాతలకు మోయలేని భారం కానుంది. ప్రస్తుతం అపరాలు, నూనెగింజలు, మిర్చి, శనగ, కూరగాయలు, ఖర్బుజా తదితర పంటలకు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఇందులో కొన్ని నేరుగా వాడుతుండగా 2 నుంచి 3 రసాయనాలు కలిపి కొన్ని పంటలకు వాడుతున్నారు. మూడు నెలలుగా వీటి ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు.

గతేడాది కిలో 450 నుంచి 500 మధ్యన లభించిన ఎసిఫేట్‌ ఇప్పుడు కంపెనీలను బట్టి 600- 700 వరకు విక్రయిస్తున్నారు. ఇమిడాక్లోప్రిడ్‌ ధర 12% పెరిగింది. మోనోక్రోటోఫాస్‌ లీటరుకు 50 రూపాయలు పెంచారు. దుకాణంలో ఏ మందు కొనాలన్నా.. లీటరు 500 పై మాటే. ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభానికి...ఇప్పటికి పురుగుమందుల ధరల్లో భారీ తేడాలున్నట్లు రైతులు చెబుతున్నా రు. దేశంలో అత్యధికంగా పురుగుమందులు ఉపయోగించే జిల్లాల్లో గుంటూరు ఒకటి. ఇక్కడ వాణిజ్య పంటల సాగు ఎక్కువ ఉంటుంది. డెల్టాలో వరి, పల్నాడు ప్రాంతంలో మిర్చి, పత్తి విస్తారంగా సాగవుతుంటాయి. రైతులు అధికంగా పురుగు, తెగుళ్ల మందులు చల్లే వాటిలో మిరప ఒకటి. తామర పురుగు కారణంగా ఈ ఏడాది పెద్దఎత్తున పంట దెబ్బతింది. పురుగు నివారణకు వేర్వేరు మందులు పిచికారీ చేస్తున్నారు. పెట్టుబడి పెరుగుతున్నా నివారణ సాధ్యం కావడం లేదు. గులాబీ పురుగు ఉద్ధృతితో పత్తి కూడా పోయింది.

రబీలో వరికి పలు దఫాలుగా మందుల్ని పిచికారీ చేస్తారు. కంది, శనగతోపాటు కూరగాయ పంటలు, పండ్లతోటల్లోనూ రసాయన మందుల్ని వినియోగిస్తారు. రైతులు ఎక్కువగా వాడే పురుగుమందుల ధరలన్నీ ఇప్పుడు పెరిగిపోయాయి. ఏపీలోని గుంటూరు జిల్లాలోనే ఏటా 550 కోట్ల రూపాయల మేర పురుగుమందుల వ్యాపారం జరుగుతోంది. ఫలితంగా...జిల్లా రైతులపై 100 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడింది.

పురుగుమందుల ధరలు పెరగటానికి ప్రభుత్వాల విధానాలతో పాటు ముడిసరుకు ధరల పెరుగుదల మరో కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పురుగుమందుల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలు జర్మనీ, జపాన్‌, చైనా తదితర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. అన్ని పురుగుమందుల తయారీలో ఉపయోగించే సాల్వెంట్‌ లీటరు 110-250 వరకు పెరిగింది. ఈ ప్రభావం అన్ని పురుగుమందులపై పడింది. ముడిపదార్థాలు, ఇంధనం ధరలు పెరగడం వల్ల తయారీ ఖర్చు పెరిగింది. చైనాలో ఎల్లో పాస్ఫరిక్‌ రసాయనాల ఉత్పత్తి తగ్గింది. అక్కడ ఎగుమతి రాయితీని చైనా ప్రభుత్వం కుదించింది. భారత కంపెనీలు అక్కడి నుంచే ఎల్లో పాస్ఫరిక్ ను దిగుమతి చేసుకుంటాయి. అక్కడి నుంచి అవసరం మేర సరుకు రాకపోవటం వల్ల దేశీయంగా కొరత ఏర్పడింది. ఎల్లో పాస్ఫరిక్ రసాయనాల ముడి సరకు ధర పెరిగింది.

ఇలా ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావం పురుగుమందుల పైనా పడింది. జర్మనీ, జపాన్‌ తదితర దేశాల నుంచి వచ్చే ముడిసరకు దిగుమతి వ్యయం కూడా పెరిగింది. కరోనా కారణంగా ముడిసరుకు దిగుమతిలో సమస్యలు వస్తున్నాయి. విదేశాల్లో కరోనా కారణంగా కొన్ని రసాయనాల ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా...కొరత ఏర్పడుతోంది. ఈ పరిణామాలన్నీ దేశీయంగా ధరలు పెరిగేందుకు కారణమైందని పురుగుమందుల దుకాణాల యజమానులు చెబుతున్నారు. ధరల పెరుగుదల ఈ స్థాయిలో ఎప్పుడూ చూడలేదని వారంటున్నారు.

జీఎస్టీతో ధరలపై ప్రభావం..
వ్యవసాయానికి ఉపయోగించే పురుగుమందులపై జీఎస్టీ అధికంగా ఉండటం కూడా ధరలపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పురుగుమందులపై 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. పెరిగిన ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో జీఎస్టీని ఎత్తివేయటం మంచిదని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. లేదా ఎరువులకు వసూలు చేస్తున్నట్లు 5% జీఎస్టీ వసూలు చేయాలని కోరుతున్నారు. ఈ రెండింటినీ రైతులకు ఇచ్చే ప్రోత్సాహకంగా కేంద్రం భావిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వాలు.. ఈ విషయమై కేంద్రానికి ప్రతిపాదన పంపిస్తే...ఫలితం ఉండొచ్చు అన్నది నిపుణుల అభిప్రాయం. ఇక ఈ పన్నులు చాలవన్నట్టు పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులూ అధికమయ్యాయి. ఇవి కూడా పురుగు మందుల ధరలు పెంచేందుకు ఓ కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
- శివకుమార్, వ్యాపారి

పురుగుమందులు ఎంత ధరకు విక్రయించాలనే విషయంలో కంపెనీలదే గుత్తాధిపత్యం. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఫలితంగా...కంపెనీలు తమ లాభాలు చూసుకుంటున్నాయే తప్ప రైతుల ఇబ్బందులు ఆలోచించటం లేదు. గతంలో ఎరువుల ధరలు పెరిగినప్పుడు రైతులకు ఊరట లభించేలా కేంద్రం రాయితీని పెంచేది. కానీ రసాయన మందుల విషయంలో అలాంటి రాయితీలేవీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. అందుకే..ఇప్పుడు పెరిగిన పురుగు మందుల ధరలతో పెట్టుబడి ఖర్చుల్లో భారీ తేడా వచ్చింది. రైతులు ఎకరానికి 2 వేల నుంచి 2,500 వరకూ అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయంలో జోక్యం చేసుకుని ధరాభారం నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.
- వి.నాగిరెడ్డి, పురుగుమందుల డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి : DCCB bank: సహకార బ్యాంకులకు సంస్కరణల చికిత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.