ETV Bharat / city

తెలంగాణ: సహకార చట్టం... అపార్టుమెంట్లకు సహకారం! - తెలంగాణ తాజా వార్తలు

సహకార చట్టం కింద అపార్టుమెంట్ల సంక్షేమ సంఘాలను నమోదు చేస్తే పటిష్ఠ రక్షణ ఉంటుందని తెలంగాణ రాష్ట్ర అధికార వర్గాలు భావిస్తున్నాయి. కొత్తగా ఏర్పడేవైనా ఈ చట్టం కింద నమోదు చేయించుకోవాలని సహకార శాఖ సూచిస్తోంది. మరింత ఎక్కువ రక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.

Permission welfare societies to apartments
సహకార చట్టం... అపార్టుమెంట్లకు సహకారం!
author img

By

Published : Dec 12, 2020, 11:49 AM IST

సహకార చట్టం కింద అపార్టుమెంట్ల సంక్షేమ సంఘాలను నమోదు చేస్తే పటిష్ఠ రక్షణ ఉంటుందని... తెలంగాణ రాష్ట్ర అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అపార్టుమెంట్లలో నివసించే కుటుంబాల వారు ఒక సంఘంగా ఏ చట్టం కింద నమోదు(రిజిస్టర్‌) చేయించుకోవాలంటూ ప్రజలు తరచూ పురపాలక, సహకార కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. ‘పరస్పర అవగాహన సహకార సంఘం’(మ్యాక్స్‌) చట్టం కింద నమోదు చేయమని గతంలో సహకార శాఖ ఆదేశాలిచ్చింది.

కానీ మ్యాక్స్‌ చట్టం కింద నమోదైన వాటిపై ప్రభుత్వ నియంత్రణ పెద్దగా లేకపోవడంతో సంఘ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తితే వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపడం లేదు. తమ సంఘంలో అవినీతి జరిగిందని లేదా కొందరు సభ్యులే ఏళ్ల తరబడి సంఘ పదవుల్లో ఉంటూ వేధిస్తున్నారని...ఇలా పలు రకాల ఫిర్యాదులు తరచూ పురపాలక, సహకార శాఖలకు వస్తున్నాయి. వీటిని ఎవరు పరిష్కరించాలనేది పెద్ద సమస్యగా మారింది. పురపాలక చట్టం కింద సంఘాన్ని నమోదు చేయనందున తమకు సంబంధం లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

సహకార శాఖ వారికి తగిన అధికారాల్లేవు. ఎందుకంటే అధికార నియంత్రణ అవసరం లేదనే.. సాధారణంగా మ్యాక్స్‌ చట్టం కింద రిజిస్టర్‌ చేయిస్తారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడే అపార్టుమెంటు సంక్షేమ సంఘాలనైనా సహకార చట్టం కింద నమోదు చేయించుకోవాలని సహకార శాఖ సూచిస్తోంది. రాష్ట్ర సహకార చట్టం-1964 కింద సంఘాన్ని నమోదు చేస్తే వాటిపై సహకార శాఖ పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. నమోదుకు ఇటీవల అనుమతి ఇచ్చినట్లు ఈ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘ఈటీవీ భారత్​’కు చెప్పారు. కొంతమంది ఇప్పటికే ఇలా నమోదు చేయించుకుంటున్నట్టు తెలిపారు. అయితే ఏ చట్టం కింద నమోదు చేయించుకోవాలనేది సంఘ సభ్యుల ఇష్టమేనని స్పష్టం చేశారు.

సహకార చట్టం కింద నమోదు చేయిస్తే...

* ఈ చట్టం కింద నమోదైన సంఘానికి సంబంధించి లెక్కలను తప్పనిసరిగా ఆడిట్‌ చేయించి సహకార కార్యాలయంలో అందజేయాలి.

* ఎన్నికలు కూడా సహకార అధికారి పర్యవేక్షణలో నిర్వహించాలి.

* సంఘం నిర్వహణలో ఏమైనా సమస్యలొచ్చి సహకార శాఖకు ఫిర్యాదుచేస్తే విచారణ అధికారిని నియమించి విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై సహకార శాఖ చర్యలు తీసుకుంటుంది.

బైలాస్‌ రూపొందించే సమయంలోనే జాగ్రత్తలు ముఖ్యం

అపార్టుమెంట్ల సంఘాల్లో ప్రధానంగా వ్యక్తుల మధ్య ఏర్పడే వ్యక్తిగత విభేదాలు చినికిచినికి గాలివానగా మారుతున్నాయి. ఒక సంఘం సభ్యుడు ఇటీవల తమ సమస్యలు తీర్చాలని ఏకంగా రాష్ట్రపతికి, ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు పంపారు. సంఘం ఏర్పాటు సందర్భంగా వారు రాసుకునే బైలాస్‌లో లోపాలు ఉన్నందున సమస్యలు పెద్దవి అవుతున్నట్లు సహకార శాఖ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ అపార్టుమెంటు సంఘం బైలాస్‌లో ఎన్నికల అంశంపై స్పష్టత లేదు.

దీంతో ఈ అపార్టుమెంటు సంఘం అధ్యక్షుడిగా ఒకరే 12 ఏళ్లుగా కొనసాగుతూ మిగతావారిని ఇబ్బందులు పెడుతున్నారు. ఒకే వ్యక్తి వరసగా ఏళ్ల తరబడి ఒకే పదవిలో ఉండేలా బైలాస్‌లో అవకాశం ఇవ్వకూడదని సహకార శాఖ సూచిస్తోంది. గరిష్ఠంగా ఒక వ్యక్తికి 2 పర్యాయాలకు మించి ఒకే పదవిలో కొనసాగకుండా చూస్తే మంచిదని సహకార అధికారి ఒకరు చెప్పారు.

ఇదీ చదవండి:

ఏపీ కేడర్​కు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రిపోర్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.