రాష్ట్రవ్యాప్తంగా 61.28 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించి రూ.1478.90 కోట్లు విడుదల చేసింది. ఈనెల నుంచి కొత్తగా 2,20,385 మందికి ఈ జాబితాలో చేరారు. కొత్తగా మరో 1568 మందికి హెల్త్ పింఛన్లు అందజేయనున్నారు.
లబ్ధిదారులకు 2.68 లక్షల మంది వాలంటీర్లు పించన్లు ఇస్తారు. కరోనా కారణంగా బయోమెట్రిక్ బదులు జియో ట్యాగింగ్ ఫొటోలు వినియోగించనున్నారు.
ఇదీ చదవండి: గవర్నర్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు