రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.1421.20 కోట్లు విడుదల చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచే 14 రకాల పింఛన్లను వాలంటీర్లు పంపిణీ చేస్తారన్నారు. బయో మెట్రిక్‌కి బదులు మొబైల్ యాప్‌లో జియో ట్యాగింగ్ చేసి, ఫొటోలు అప్‌లోడ్ చేస్తారని మంత్రి వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవీ, డయాలసిస్ రోగుల బ్యాంకు ఖాతాలకు పింఛన్ సొమ్ము జమ చేస్తామన్నారు.
ఇవీ చదవండి...అర్ధాకలితో బిక్కుబిక్కు ....మందుల కొనుగోలుకూ డబ్బుల్లేవ్..!