కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లిలో.. ప్రజలే స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకున్నారు. గత వారం వేరే గ్రామానికి పండగకు వెళ్లిన వారంతా అస్వస్థతకు గురైన కారణంగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల్లోనే 53మందికి వ్యాధి నిర్ధరణ కావటంపై... గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.
వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా పంచాయతీ పాలకవర్గం ప్రజలందరి అంగీకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంది. గ్రామంలో లాక్‌డౌన్ అమలుకు తీర్మానించింది. ప్రజలందరూ సహకరించాలని కోరింది. కేసులు కాస్త తగ్గుముఖం పట్టేవరకు ఆంక్షలు అమల్లో ఉండేలా చర్యలు తీసుకుంది.
ఇదీ చూడండి: