రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. కక్షసాధింపు ధోరణితో ప్రజావేదికను జగన్ కూల్చివేయించారన్న ఆయన... వైకాపా ఏడాది పాలనంతా విధ్వంసాలు, కూల్చివేతలేనని ఆరోపించారు. ఏడాది కాలంలో ఒక్క నిర్మాణమైన జగన్ చేపట్టారా..? అని ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చి రూ.9 కోట్ల ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. 108 కుంభకోణాన్ని బయటపెడితే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందన్న పట్టాభి... న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించేందుకు వైకాపా యత్నం చేస్తోందని ఆక్షేపించారు.
ఇదీ చదవండి:
'ప్రజావేదికను మళ్లీ కడతాం.. వైకాపా అరాచకాలను మ్యూజియంలో పెడతాం'