మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ ఎందుకు వద్దనుకుంటున్నారో చెప్పాలని... తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నించారు. విజయమ్మ లేఖపై పట్టాభి మీడియా సమావేశం నిర్వహించారు. సీబీఐ విచారణ అవసరం లేదని పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారని నిలదీశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక సిట్‌ను మార్చేశారన్న తెదేపా నేత... అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి పేర్లను లేఖలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. సిట్ మార్చేసి దోషులను కాపాడేందుకు యత్నిస్తున్న విషయం కనపడలేదా అని నిలదీశారు. జగన్ పరిపాలనలో రక్షణ లేదని సునీత కోర్టులో పిటిషన్ వేయలేదా..? అని ప్రశ్నించారు. కోడికత్తి డ్రామాలో సహకరించిన వైద్యులకు కీలక పదవులు కట్టబెట్టారని పట్టాభి ఆరోపించారు.
ఇదీ చదవండి: