ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ పోలీస్ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు చెప్పారు.
ఇప్పటి వరకు అంతర్రాష్ట్ర ప్రయాణాలకు డీజీపీ కార్యాలయం ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతినిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఫలితంగా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్పోర్ట్ పాసులను జారీ చేయడాన్ని తెలంగాణ పోలీసు శాఖ నిలిపివేసింది.
తెలంగాణకు వెళ్లే వాహనాలకు కూడా వాహన పాసులను అక్కడి పోలీసులు అడగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన వారు స్పందన యాప్‌లో, కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేవారు ఆ రాష్ట్రానికి చెందిన సేవా యాప్‌లో... మహరాష్ట్రకు వెళ్లే వారు ఆ రాష్ట్ర పోర్టల్‌లో తమ పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని తెలంగాణ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: