- ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన పోలీసులకు డీజీపీ అభినందనలు
- తొలివిడత కంటే రెండోవిడతలో ఎక్కువ శాతం పోలింగ్: డీజీపీ
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నాం: డీజీపీ
- 2013 పంచాయతీ ఎన్నికల కంటే ఈసారి తక్కువ అల్లర్లు: డీజీపీ సవాంగ్
- ప్రజలంతా నిర్భయంగా ఓటుహక్కు ఉపయోగించుకున్నారు: డీజీపీ
- 3, 4 విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు కృషి: డీజీపీ
పంచాయతీ పోరు: ముగిసిన రెండో దశ పోలింగ్
19:25 February 13
ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన పోలీసులకు డీజీపీ అభినందనలు
18:21 February 13
81.67 శాతం పోలింగ్
రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో 81.67 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లా | పోలింగ్ శాతం |
శ్రీకాకుళం | 72.87 |
విజయనగరం | 82 |
విశాఖ | 84.94 |
తూర్పుగోదావరి | 82.86 |
పశ్చిమగోదావరి | 81.75 |
కృష్ణా | 84.12 |
గుంటూరు | 85.51 |
ప్రకాశం | 86.67 |
నెల్లూరు | 78.04 |
చిత్తూరు | 77.20 |
కడప | 80.47 |
కర్నూలు | 80.76 |
అనంతపురం | 84.65 |
17:37 February 13
- రెండోదశ ఎన్నికలు: తూర్పుగోదావరి జిల్లాలో 82.86 శాతం పోలింగ్
16:06 February 13
దొంగ ఓట్లు వేశారంటూ గ్రామస్థుల ఆందోళన..
- నెల్లూరు: ఏఎస్‌పేట మండలం రాజవోలులో ఉద్రిక్తత
- దొంగ ఓట్లు వేశారంటూ పోలింగ్ కేంద్రాన్ని చుట్టుముట్టిన గ్రామస్థులు
- అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణ
- బ్యాలెట్ పెట్టెలు తీసుకెళ్లనివ్వకుండా సిబ్బందిని అడ్డుకున్న గ్రామస్థులు
15:28 February 13
ముగిసిన రెండో దశ పోలింగ్..
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కించనున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. 2,786 సర్పంచి స్థానాలు, 20,817 వార్డు స్థానాలకు పోలింగ్ పూర్తి చేశారు. 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో పోలింగ్ జరిగింది.
15:19 February 13
పోలింగ్ శాతం ఇలా..
రాష్ట్రంలో రెండోదఫా పంచాయతీ పోరు ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 13 జిల్లాల్లో 76.11 శాతం పోలింగ్ నమోదైంది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 81.07 పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 69.08 శాతం ఓట్లు పోలయ్యాయి.
జిల్లా | పోలింగ్ శాతం |
శ్రీకాకుళం | 69.08 |
విజయనగరం | 77.30 |
విశాఖ | 79.81 |
తూర్పుగోదావరి | 74.97 |
పశ్చిమగోదావరి | 75.75 |
కృష్ణా | 76.56 |
గుంటూరు | 78.32 |
ప్రకాశం | 78.53 |
నెల్లూరు | 72.94 |
చిత్తూరు | 72.06 |
కడప | 75.17 |
కర్నూలు | 77.91 |
అనంతపురం | 81.07 |
15:16 February 13
ప్రకాశం జిల్లాలో మధ్యాహ్నం 2.30 గంటలకు 78.53 శాతం పోలింగ్ నమోదైంది.
14:57 February 13
గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం 2.30 గంటలకు 78.32 శాతం పోలింగ్ నమోదైంది.
14:55 February 13
కడప జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 75.17 శాతం పోలింగ్ నమోదైంది.
14:25 February 13
నక్సల్ ప్రభావిత పంచాయతీల్లో ముగిసిన పోలింగ్..
విజయనగరం జిల్లాలో సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకే పోలింగ్ ముగిసింది. పార్వతీపురం డివిజన్‌లోని 8 గిరిజన మండలాల్లో 60 గ్రామ పంచాయతీలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకే పోలింగ్ నిర్వహించారు.
13:04 February 13
ఎన్నికల విధుల్లో వీఆర్ఏ మృతి
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి వద్ద విషాదం జరిగింది. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా వీఆర్ఏ నరసింహులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వీఆర్ఏ మృతిచెందారు.
12:59 February 13
అభ్యర్థుల మధ్య ఘర్షణ
నెల్లూరు జిల్లా ఎస్.పేట మండలం చిరమన పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెెలకొంది. చిరమన పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వ్యక్తులను పోలీసులు చెదరగొడుతున్నారు.
12:48 February 13
పోలింగ్ శాతం ఇలా..
రాష్ట్రంలో రెండోదఫా పంచాయతీ పోరు ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటలకు 13 జిల్లాల్లో 64.75 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లా | పోలింగ్ శాతం |
శ్రీకాకుళం | 51.30 |
విజయనగరం | 71.50 |
విశాఖ | 64.28 |
తూర్పుగోదావరి | 60.90 |
పశ్చిమగోదావరి | 63.54 |
కృష్ణా | 66.64 |
గుంటూరు | 67.08 |
ప్రకాశం | 65.15 |
నెల్లూరు | 59.22 |
చిత్తూరు | 67.20 |
కడప | 64.28 |
కర్నూలు | 69.61 |
అనంతపురం | 70.32 |
12:43 February 13
నిలిచిన పోలింగ్..
కడప జిల్లా రామాపురం మండలం హసనాపురంలో పోలింగ్ తాత్కాలికంగా నిలిచింది. స్వస్తిక్ గుర్తుకు బదులుగా వేరే గుర్తు పడుతుందని ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏజెంట్ల అభ్యంతరంతో పోలింగ్ నిలిపి.. అధికారులు పరిశీలిస్తున్నారు.
12:40 February 13
ఎన్నికల కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత
గుంటూరు జిల్లా నకరికల్లు పంచాయతీ ఎన్నికల కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానికేతర నేతలు పోలింగ్ కేంద్రంలోకి వచ్చారని మరో వర్గం ఆరోపించింది. స్థానికేతరులు వచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు వర్గాలవారిని పోలీసులు చెదరగొట్టారు.
12:23 February 13
పోలింగ్ రోజే ప్రసవం
సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన 9 నెలల గర్భిణి పోలింగ్ రోజునే ఓటు వేసి మరీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన కృష్ణాజిల్లా కోరుకల్లులో చోటుచేసుకుంది. కలిదిండి మండలం కోరుకల్లు గ్రామంలో సర్పంచి స్థానం మహిళకు రిజర్వు కాగా.. బట్టులీలాకనకదుర్గ అభ్యర్థిగా బరిలో దిగింది. 9నెలల గర్భిణిగానే కడుపులో బిడ్డను మోస్తూ ఎన్నికల ప్రచారంలో ఆమె చురుగ్గా పాల్గొంది. ఓటు వేసిన కాసేపటికే ఆమెకు నొప్పులు రాగా ఆమెను కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పండంటి ఆడపిల్లకు ఆమె జన్మనిచ్చింది. సర్పంచిగా పోటీచేసి ఓటు వేసిన రోజే బిడ్డ పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించింది.
11:46 February 13
మాటామాటా పెరిగి ఘర్షణ..
పోలింగ్ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటు చేసుకొంది. ఇరువర్గాల వారు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోగా ఘర్షణకు దారి తీసింది. ఎమ్మెల్యే జోగారావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కొంత సమయం పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఉన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు
11:39 February 13
ఇరువర్గాల మధ్య తోపులాట..
గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం మారెల్లవారిపాలెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కమ్మవారిపాలెం ఓటర్లను ఓ వర్గం అడ్డుకుంది. ఓట్లు వేయకుండా వెనక్కి పంపిస్తున్నారని మరో వర్గం ఆరోపిస్తోంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల మోహరించి పరిస్థితిని అదుపు చేస్తున్నారు.
11:30 February 13
అవాక్కైన మహిళ..
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం గ్రామంలో షేక్ రహమతున్నీసా అనే మహిళా ఓటేసేందుకు వెళ్లగా.. ఇప్పటికే మీ ఓటు వినియోగించుకున్నారని అధికారులు చెప్పగా ఆమె అవాక్కయ్యింది. సదరు ఓటరు రహమతున్నీసా భర్తతో కలిసి పోలింగ్ కేంద్రం వద్ద నిరసనకు దిగారు. తన ఓటు ముందుగానే వేసి ఉండడంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
11:20 February 13
పోలీసు సాయం.. ఓటేసిన శతాధిక వృద్ధురాలు
కృష్ణా జిల్లా సాన రుద్రవరం పొలింగ్ కేంద్రంలో శతాధిక వృద్ధురాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఐ దుర్గారావు సత్తువ లేక నడవ లేని స్థితిలో ఉన్న ఆమెను తన చేతులతో స్వయంగా మోసుకొని తీసుకువెళ్లి.. ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు
10:57 February 13
పోలింగ్ శాతం
రాష్ట్రంలో రెండోదఫా పంచాయతీ పోరు ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం10.30 గంటలకు 13 జిల్లాల్లో 38.07 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లా | పోలింగ్ శాతం |
శ్రీకాకుళం | 26.81 |
విజయనగరం | 48.80 |
విశాఖ | 40.94 |
తూర్పుగోదావరి | 34.51 |
పశ్చిమగోదావరి | 31.06 |
కృష్ణా | 35.81 |
గుంటూరు | 45 |
ప్రకాశం | 34.14 |
నెల్లూరు | 36.03 |
చిత్తూరు | 33.50 |
కడప | 35.17 |
కర్నూలు | 46.96 |
అనంతపురం | 46.18 |
10:42 February 13
ఏజెంట్ అరెస్టు
కడప: సంబేపల్లి మండలం దుద్యాల పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ అరెస్టు
పోలింగ్ కేంద్రంలో తిరుగుతున్నాడని ఏజెంట్ రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టు
ప్రత్యర్థుల ఫిర్యాదు మేరకు ఏజెంట్ రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టు
10:29 February 13
నిమ్మకూరు పోలింగ్ కేంద్రంలో వివాదం
కృష్ణా జిల్లా నిమ్మకూరు పోలింగ్ కేంద్రంలో వివాదం నెలకొంది. ఓటరుకు సహాయకుడిని పంపే విషయంలో వివాదం తలెత్తింది. బాహాబాహీకి దిగేందుకు ఇరువర్గాల యత్నించగా..వారిని పోలీసులు అడ్డుకున్నారు.
10:27 February 13
స్లిప్పులు లాక్కొని ఓట్లు..
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటర్ స్లిప్పులు లాక్కొని ఓట్లు వేస్తున్నారని ఓ అభ్యర్థి వర్గం ఆరోపణలు చేస్తోంది. దీంతో మరో అభ్యర్థి వర్గం ఆందోళనకు దిగారు. పోలీసుల మోహరించి ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేస్తున్నారు.
10:04 February 13
ఒకే గదిలో రెండు వార్డులకు పోలింగ్
తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలో ఒకే గదిలో రెండు వార్డులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒకే గదిలో రెండు వార్డులకు పోలింగ్‌తో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.
09:50 February 13
కడప జిల్లా కమలాపురం మండలం కొగటంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని పోలీసులు గృహనిర్బంధించారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు.
09:28 February 13
ఓటేసిన.. శతాధిక వృద్ధురాలు
చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం వలసపల్లెలో శతాధిక వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుంది. 102 ఏళ్ల గంగులమ్మ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసింది. 80 ఏళ్ల కుమారుడు, కోడలుతో కలిసి గంగులమ్మ ఓటేసింది.
09:20 February 13
పోలింగ్ శాతం ఇలా..
రాష్ట్రంలో రెండోదఫా పంచాయతీ పోరు ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 8.30 గంటలకు 10.48శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లా | పోలింగ్ శాతం |
శ్రీకాకుళం | 10.4 |
విజయనగరం | 11.6 |
విశాఖ | 12.4 |
తూర్పుగోదావరి | 10.67 |
పశ్చిమగోదావరి | 10.5 |
కృష్ణా | 6.72 |
గుంటూరు | 10 |
ప్రకాశం | 11 |
నెల్లూరు | 11.8 |
చిత్తూరు | 6.13 |
కడప | 7.05 |
కర్నూలు | 21 |
అనంతపురం | 7.03 |
09:18 February 13
ప్రశాంతంగా పోలింగ్..
రాష్ట్రంలో రెండోదఫా పంచాయతీ పోరు ప్రశాంతంగా సాగుతోంది. 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో 167 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. కరోనా దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే జనం ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రెండో విడతలో 3,328 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 539 ఏకగ్రీవమయ్యాయి.
09:12 February 13
కుప్పకూలిన మహిళ..
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం జొన్నలగడ్డ పోలింగ్ కేంద్రం వద్ద ఓ మహిళ కుప్పకూలింది. మూర్ఛ రావడంతో మహిళ కుప్పకూడంతో.. ఆస్పత్రికి తరలించారు.
09:06 February 13
ఎన్నికల బహిష్కరణ..
ఓట్లు అధికంగా వేస్తున్నారన్న ఆరోపణలతో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ళపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వర్గం గొడవకు దిగగా.. ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎన్నికను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. వారికి సర్దిచెప్పేందుకు పోలీసులు శ్రమించారు.
08:08 February 13
పోలింగ్ ఆలస్యం..
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం అంకంపల్లి ఆరో వార్డులో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్స్ ఓపెన్ కాకపోవడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభించారు. ఆరుబయటే పోలింగ్ జరుగుతోంది.
08:03 February 13
పోలింగ్ నిలిపివేత..
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడు రెండో వార్డులో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. బ్యాలెట్ పేపర్లలో గుర్తులు తారుమారు కావటంతో పోలింగ్ నిలిపివేసినట్లు ఉన్నతాధికారులకు.. సిబ్బంది సమాచారం అందించారు.
07:55 February 13
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
07:22 February 13
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభం
విజయనగరం జిల్లాలో.. గ్రామ పంచాయితీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పార్వతీపురం మండలం కృష్ణ పల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఓటు హక్కు వినియోగించుకున్నారు గ్రామంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
07:21 February 13
చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో విడత పోలింగ్ ప్రారంభం
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
06:33 February 13
ప్రారంభమైన పోలింగ్..
రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలీంగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగనుంది. 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లు, 167 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం ఓటింగ్ జరుగుతుంది.
06:21 February 13
బ్యాలెట్ పత్రాలు మాయం..
గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డలో గ్రామపంచాయతీ 8వ వార్డులో బ్యాలెట్ పత్రాలు మాయమయ్యాయి. రిజర్వు బ్యాలెట్ పత్రాలతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సిబ్బంది రాత్రి భోజనం చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లారు.
06:18 February 13
రాయచోటి మండలంలో పోలింగ్ కేంద్రాలపై ఈసీకి ఫిర్యాదు
కడప జిల్లా రాయచోటి మండలంలో గొర్లముదివేడు కస్పా, ఏపిలవంకపల్లె, బాలిరెడ్డిగారిపల్లె పోలింగ్ కేంద్రాలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఈసీకి వెల్లడించారు. స్వేచ్ఛగా ఓటు వేసుకునేలా భద్రత ఏర్పాటు చేయాలని ఓటరు సద్దాం ఈసీని కోరారు.
06:16 February 13
- పోలింగ్ సరళి పరిశీలనకు 2,606 మంది నియామకం
- వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్న ఎస్‌ఈసీ, అధికారులు
- సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
- ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక
06:15 February 13
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాలకొండ డివిజన్లలో 10 మండలాల్లో పోలింగ్
- విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లోని 15 మండలాల్లో పోలింగ్
- విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లోని 10 మండలాల్లో ఎన్నికలు
- తూ.గో. జిల్లా రాజమహేంద్రవరం, రామచంద్రాపురం డివిజన్లలో పోలింగ్
- ప.గో. జిల్లా కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌లోని 13 మండలాల్లో ఎన్నికలు
- కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ డివిజన్‌లోని 9 మండలాల్లో ఎన్నికలు
- గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్‌లోని 11 మండలాల్లో పోలింగ్
- ఒంగోలు, కందుకూరు డివిజన్లలోని 14 మండలాల్లో పోలింగ్
- నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్‌లోని 10 మండలాల్లో పోలింగ్
- కర్నూలు జిల్లా నంద్యాల, కర్నూలు డివిజన్లలోని 13 మండలాల్లో ఎన్నికలు
- అనంతపురం జిల్లా ధర్మవరం, కల్యాణదుర్గం డివిజన్లలోని 19 మండలాల్లో పోలింగ్
- కడప రెవెన్యూ డివిజన్‌లోని 12 మండలాల్లో ఎన్నికలు
- చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్‌లోని 17 మండలాల్లో పోలింగ్
06:06 February 13
రాష్ట్రంలో రెండోదశ పల్లెపోరు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. రెండో విడతలో 3వేల328 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 539ఏకగ్రీవమయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని 2 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కానందున ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 2 వేల 786 సర్పంచ్ స్థానాలకు 7 వేల 507 మంది పోటీ పడుతున్నారు. 33 వేల 570 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 12 వేల 604 ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. మిగిలిన 20 వేల 817 వార్డుల్లో 44 వేల 876 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో దశకు 29 వేల 304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇందులో 5 వేల 480 సున్నితమైనవిగా, 4 వేల 181 అతిసున్నితమైనవిగా గుర్తించినట్టు పంచాయతీరాజ్ శాఖ వివరించింది.