ETV Bharat / city

Koushik Reddy: తెరాస గూటికి కౌశిక్​ రెడ్డి.. రేపే చేరిక! - హుజూరాబాద్​ వార్తలు

తెలంగాణలో హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ రాజకీయం వేడెక్కుతోంది. అక్కడి కాంగ్రెస్ మాజీ నాయకుడు నేత కౌశిక్ రెడ్డి... తెరాసలో చేరుతున్నట్లు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాస గూటికి చేరనున్నట్టు చెప్పారు.

padi koushik
కౌశిక్​ రెడ్డి
author img

By

Published : Jul 20, 2021, 12:22 PM IST

తెరాస తీర్థం పుచ్చుకోనున్న కౌశిక్​ రెడ్డి

తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. అక్కడ కీలక నేతల్లో ఒకరిగా ఉన్న కౌశిక్ రెడ్డి.. అధికార పార్టీ తెరాసలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. హుజూరాబాద్ అభివృద్ధి కోసం తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కౌశిక్​ రెడ్డి స్వయంగా వెల్లడించారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు. పెద్దఎత్తున తరలిరావాలని తన అభిమానులను కోరారు.

సీఎం కేసీఆర్ కృషితో హుజూరాబాద్‌ రైతులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాళేశ్వరం, ఎల్‌ఎండీ జలాలతో సమృద్ధిగా పంటలు పండుతున్నాయన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చారని ప్రశంసించారు. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఈటల సద్వినియోగం చేసుకోలేదని చెప్పారు. ప్రజా సమస్యల కోసం ఈటల రాజేందర్ రాజీనామా చేయలేదని..స్వలాభం కోసమే రాజీనామా చేశారని ఆరోపించారు.

రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం సమక్షంలో తెరాసలో చేరుతున్నా. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కేసీఆర్​.. పేదలకు అండగా నిలుస్తున్నారు. దళిత బంధు పథకం అమలుకు హుజూరాబాద్​ను ఫైలెట్​ ప్రాజెక్టుగా ఎంచుకున్నందుకు సంతోషంగా ఉంది. సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నా. రైతు బంధు కూడా హుజూరాబాద్​ నుంచే మొదలైంది. -కౌశిక్​ రెడ్డి, కాంగ్రెస్ మాజీ నాయకుడు

ఈటల రాజీనామాతో...

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి, తెరాస సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో... హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. తెరాస నుంచి టికెట్‌ తనకే వస్తుందని కౌశిక్​ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపినట్టుగా విడుదలైన సంభాషణ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. మాదన్నపేటకు చెందిన విజయేందర్‌ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి ఫోన్​లో మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ తెరాస టికెట్‌ తనకే ఖాయమైనట్లు చెప్పినట్టుగా ఆ సంభాషణలో ఉంది.

యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని.. ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ. 4-5 వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజయేందర్‌కు కౌశిక్‌రెడ్డి సూచించారు. ఈ ఫోన్​ సంభాషణ సోషల్​ మీడియాలో వైరల్​గా మారటంతో కాంగ్రెస్​ కౌశిక్​ రెడ్డికి షోకాజ్​ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. దీంతో కౌశిక్​ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ- ఆ పీసీసీ చీఫ్ రాజీనామా

భారత విమానాలపై నిషేధం పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.