ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని... ఆక్సిజన్ సేకరణ, సరఫరా పర్యవేక్షణ అధికారి కృష్ణబాబు వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రులకు విస్తృతంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని వివరించారు. కేంద్రానికి సీఎం లేఖ, తదుపరి చర్యలతో ఆక్సిజన్ సరఫరా వేగవంతమైందని చెప్పారు. రాష్ట్రానికి కొత్తగా మరో 3 ఐఎస్‌వో ట్యాంకులు, మొత్తంగా 6 ట్యాంకులు వస్తున్నాయని వెల్లడించారు.
జామ్‌నగర్ నుంచి 110 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ వస్తుందని కృష్ణబాబు వెల్లడించారు. రాష్ట్రానికి మరో 3 ఐఎస్‌వో ట్యాంకులను కేంద్రం ఇస్తోందని చెప్పారు. ఎల్లుండికి 60 టన్నుల ఆక్సిజన్‌తో ప్రత్యేక రైలు కృష్ణపట్నం చేరుతుందని వివరించారు. దుర్గాపూర్ పరిశ్రమలోని 2 కొత్త ట్యాంకుల్లో ఆక్సిజన్ నింపారన్న కృష్ణబాబు... ఒక్కో ట్యాంకులో 20 టన్నుల, 40 టన్నుల ఆక్సిజన్ ఉంటుందని తెలిపారు.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ట్యాంకులు కృష్ణపట్నం శనివారం వస్తాయి. ప్రత్యేక రైలు ద్వారా 3 ట్యాంకుల చొప్పున నిరంతర ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. ఒక్కో ట్రిప్పులో ప్రత్యేక రైళ్లు 60 టన్నుల ఆక్సిజన్ తేనున్నాయి. ఒడిశాలో వివిధ కర్మాగారాల నుంచి ఆక్సిజన్ సేకరించనున్నాయి. నెల్లూరు, రాయలసీమ ఆస్పత్రులకు రిజర్వ్‌లో ఆక్సిజన్ నిల్వలు సరఫరా చేస్తాం. జామ్‌నగర్ నుంచి రాష్ట్రానికి మరో 110 టన్నుల ఆక్సిజన్ రానుంది. రేపు గుంటూరు రైలు ద్వారా 110 టన్నుల ఆక్సిజన్ వెళ్తుంది.-కృష్ణబాబు
ఇదీ చదవండీ... అంబులెన్స్‌ల అడ్డగింత.. లీగల్ ఫైట్‌కు సర్కారు సై