ETV Bharat / city

15న బొమ్మ పడటం కష్టమే!

author img

By

Published : Oct 12, 2020, 8:40 AM IST

ఈ నెల 15 నుంచి సినిమా హాళ్లను తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చినా...రాష్ట్రంలో యాజమాన్యాలు సిద్ధంగా లేవు. కొత్త సినిమాలు లేకపోవటం, విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోవటం వారిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు.

movie theaters
15న బొమ్మ పడటం కష్టమే

లాక్‌డౌన్‌తో మూతపడిన సినిమా హాళ్లను ఈ నెల 15 నుంచి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినా... రాష్ట్రంలో యాజమాన్యాలు సిద్ధంగా లేవు. థియేటర్లు తెరచినా ప్రదర్శించడానికి కొత్త సినిమాలేవీ లేకపోవడం వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య. కరోనాతో నిలిచిన సినిమా చిత్రీకరణలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మూడు నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమైనా తేదీలు ప్రకటించలేదు. దీపావళికిగానీ సినిమాహాళ్లు ప్రారంభించే పరిస్థితి లేదని 90% యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆర్థిక స్థోమత ఉన్న కొన్ని థియేటర్లు, కొన్ని మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నా... వారి ప్రధాన సమస్యా సినిమాలు లేకపోవడమే.

సినిమా థియేటర్లు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య లాక్‌డౌన్‌లో పేరుకుపోయిన విద్యుత్తు బిల్లుల బకాయిలు. మార్చి చివరి వారం నుంచి థియేటర్లు మూతపడినా... ఇప్పటికీ ప్రతి నెలా కనీస ఛార్జీలు చెల్లించాలంటూ బిల్లులు వస్తున్నాయి. కొన్ని థియేటర్ల యాజమాన్యాలు బిల్లులు చెల్లించకపోవడంతో... విద్యుత్‌ పంపిణీ సంస్థలు కనెక్షన్లు తీసేశాయి. బకాయిలన్నీ చెల్లిస్తే కనెక్షన్లు పునరుద్ధరిస్తామని చెబుతున్నాయి. ఏడు నెలలుగా థియేటర్లు మూతపడి ఇబ్బందుల్లో ఉన్న తాము... బకాయిలు చెల్లించలేమని, రద్దు చేయాలని యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

* రాష్ట్రంలో చిన్నా, పెద్దా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు కలిపి 1,050 ఉన్నాయి.

* థియేటర్లు తెరవాలంటే 24 రకాల నిబంధనలు పాటించాలని ప్రభుత్వం షరతు పెట్టింది.

* థియేటర్లు శానిటైజ్‌ చేయడానికి యంత్రాలు, థర్మల్‌ స్కానర్లు కొనాలి.

* మళ్లీ థియేటర్‌ తెరవాలంటే రూ.7-8 లక్షలు ఖర్చు పెట్టాల్సిందేనని యాజమాన్యాలు అంటున్నాయి.

అసలే కరోనా... ఆపై సగం సీట్లు

అక్టోబరు 15 నుంచి థియేటర్లు తెరచినా... సగం సీట్లతోనే నడపాలని, గరిష్ఠంగా ఒక షోకు 200 మందికి మించి ప్రేక్షకులను అనుమతించరాదని ప్రభుత్వం స్పష్టంచేసింది. సగం సీట్లతో థియేటర్‌ నడిపినా, నిర్వహణ ఖర్చులు తగ్గవని, కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల దృష్ట్యా వ్యయం ఇంకా పెరుగుతుందని యాజమాన్యాలు చెబుతున్నాయి. సగం సీట్లతో థియేటర్లు నడపడం లాభదాయకం కాదంటున్నాయి. ‘సినిమా హాలు మూసేసి ఉంటే నిర్వహణ ఖర్చులు, జీతభత్యాలకు నెలకు రూ.1.80 లక్షలు ఖర్చవుతుంది. అదే తెరిస్తే రూ.3 లక్షలు పెట్టాలి. నాకైతే మూసేసి కూర్చోవడమే సుఖం’ అని విజయవాడకు చెందిన ఒక థియేటర్‌ యజమాని తెలిపారు.

టికెట్‌ ధర పెంపుపై భిన్నాభిప్రాయాలు

సగం సీట్లతోనే థియేటర్లు నడపాల్సి రావడంతో పాటు, అదనంగా శానిటైజేషన్‌ ఖర్చుల భారమూ పడుతుంది కాబట్టి టికెట్‌ ధర పెంచుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని ఎగ్జిబిటర్లలో ఒక వర్గం ప్రతిపాదిస్తోంది. ఎక్కువ మంది దీనికి విముఖంగా ఉన్నారు. ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమవుతోందని, టికెట్‌ ధరలు పెంచితే ఇటువైపే చూడరన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. శానిటైజేషన్‌కు పెట్టాల్సిన ఖర్చు సగటున ఒక్కో ప్రేక్షకుడికి రూ.5 దాకా ఉంటుందని, దానిని వారి నుంచే వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతివ్వాలని కొందరు కోరుతున్నారు.

విద్యుత్‌ బకాయిలు రద్దు చేయాలి

లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్లకు వేసిన విద్యుత్‌ ఛార్జీలను, ఆస్తి పన్నును ప్రభుత్వం మాఫీ చేయాలి. శానిటైజేషన్‌ ఖర్చుల్ని ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలి.

- పి.శ్రీనివాసరావు, ఏపీ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి, కాకినాడ

ఖర్చులు భరించలేం

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యజమానులు నిర్వహణ ఖర్చులు భరించడం కష్టం. సాధారణంగా 65 శాతం సీట్లు నిండితేనే నష్టాల్లేకుండా నడపగలం. ప్రస్తుతం సగం సీట్లకే అనుమతిచ్చారు కాబట్టి, అవైనా పూర్తిగా నిండితేనే ఖర్చులు వస్తాయి.

-భూపాల్‌ ప్రసాద్‌, నవరంగ్‌ థియేటర్స్‌ యజమాని, విజయవాడ

విడుదల తేదీలు ప్రకటిస్తేనే

థియేటర్‌ తెరిస్తే... ఏ సినిమా వేయాలో అర్థంకాని పరిస్థితి. ఒకటి రెండు సినిమాలైనా విడుదల తేదీలు ప్రకటిస్తేనే ముందుకు వెళ్లగలం. ప్రభుత్వం విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్ను బకాయిలు మాఫీ చేయడంతో పాటు, జీఎస్టీనీ తగ్గించాలి.

-జి.సురేంద్రకుమార్‌, ఎగ్జిబిటర్‌, చాగల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.