ETV Bharat / city

ప్రేమోన్మాది దాడిపై పలువురు నేతల మండిపాటు - ప్రొద్దుటూరు ఘటన పై వంగలపూడి అనిత స్పందన

కడప జిల్లా ప్రొద్దుటూరులో యువతిపై దాడిని పలు పార్టీల నేతలు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం 'దిశ' చట్టం అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

opposition party leaders
ప్రొద్దుటూరు ప్రేమోన్మాది దాడిపై పలువురు నేతల మండిపాటు
author img

By

Published : Jan 22, 2021, 7:46 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో యువతిపై ప్రేమోన్మాది దాడి చేయటాన్ని పలు పార్టీల నేతలు ఖండించారు.

వైకాపా 20నెలల పాలనలో 350మంది మహిళలు బలయ్యారు. సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందనటానికి.. లావణ్యపై జరిగిన దాడే ఉదాహరణ. దిశ ఓ దశ లేని చట్టంగా మిగిలింది. దీనిపై గొప్పలు చెప్పుకుంటున్న నేతలకు ప్రేమోన్మాద దాడులు కనిపించడం లేదా ? ఓ మహిళ.. హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే మహిళలపై దారుణాలను అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. - వంగలపూడి అనిత, తెదేపా రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు

ప్రొద్దుటూరులో యువతిపై కత్తితో దాడి అమానుషం. ప్రేమోన్మాది సునీల్‌ను కఠినంగా శిక్షించాలి. యువతిని ప్రేమోన్మాది వేధిస్తుంటే పోలీసులకు పట్టలేదు. రాష్ట్రంలో యువతులు, మహిళలకు రక్షణ కరువైంది. 'దిశ' చట్టం ప్రచారానికే పరిమితమై అమలులో విఫలమైంది. పోలీసు వ్యవస్థ కేవలం ప్రతిపక్షాలను భయపెట్టే పనిలో ఉంది.

- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇదీ చదవండీ.. 'నాపై దాడికి మంత్రి కొడాలి నాని రౌడీలను సిద్ధం చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.