ETV Bharat / city

ఆన్‌లైన్‌ రమ్మీ కమ్మేస్తోంది - రమ్మీ వార్తలు

ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడండి..గంటలో వేలు..రోజులో లక్షలు గెలుచుకోండి అంటూ ఆకర్షణీయ ప్రకటనలతో ఊరిస్తారు. సరదాకో, కాలక్షేపానికో ఆట మొదలెడితే కొత్తలో వందలు, వేలు గెలిచేందుకు అవకాశాలు కల్పించి నెమ్మదిగా ఉచ్చులోకి లాగుతారు. అందులో చిక్కుకుపోయారో జీవితాలు తలకిందులవడం ఖాయం. వీటి బారిన పడి ఏటా వేలమంది సర్వం కోల్పోతున్నారు.

rummy
rummy
author img

By

Published : Jun 1, 2020, 6:50 AM IST

రెండు నెలలుగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రభావంతో ఇళ్లకే పరిమితమైన కొందరు కాలక్షేపం కోసం ఆన్‌లైన్‌ జూద వేదికలను ఆశ్రయించి కోట్లలో నష్టపోయారు.

‘‘ఆ యాప్‌లో చేరి ఆట మొదలు పెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నప్పుడే ఆ వ్యక్తి ఆర్థిక స్థోమత వంటివి యాప్‌ల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అది తెలియక ఆడటం ప్రారంభించి.. తొలుత వచ్చే కొంత మొత్తంతో ఆకర్షణకు లోనయ్యా. ఆ తర్వాత అందులో పొగొట్టుకున్న డబ్బు జీవితాన్నే తారుమారు చేసిందని విజయవాడకు చెందిన ఓ బాధితుడు ‘‘ఈనాడు-ఈటీవీ’’భారత్​తో మాట్లాడుతూ వాపోయారు.

వాట్సప్‌లో బృందంగా ఏర్పడిన బాధితులు

ఆన్‌లైన్‌ జూదం బారిన పడి భారీగా నష్టపోయిన పలువురు బాధితులు ఇటీవల వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకుని జరిగిన నష్టంపై లబోదిబోమంటున్నారు. ఇలా 176 మంది సభ్యులుగా ఉన్న ఓ వాట్సాప్‌ గ్రూపులోని బాధితులు గత రెండు నెలల్లో దాదాపు రూ.13 కోట్లు కోల్పోయారు. ఇలాంటి వారు వేలల్లోనే ఉన్నారు. వీరంతా దాదాపు రూ.100 కోట్లకు పైగా కోల్పోయి ఉంటారని అంచనా. ఈ ఆట ఆడినందుకు తిరిగి తమపైనే కేసులు పెడతారేమోనన్న భయంతో ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. వారిలాగ మరింత మంది నష్టపోకుండా ఆన్‌లైన్‌ పేకాటపై ఆంధ్రప్రదేశ్‌లో నిషేధం విధించాలని బాధితులు కోరుతున్నారు.

ఉద్యోగం పోయి... ఆస్తులమ్మి..

విజయవాడలోని ఓ ప్రఖ్యాత షోరూమ్‌లో పనిచేసే ఉద్యోగి.. సరదా కోసం ఆన్‌లైన్‌లో పేకాట మొదలుపెట్టారు. చివరకు తాను పనిచేసే సంస్థకు చెందిన దాదాపు రూ.18 లక్షలను ఆటలో కోల్పోయారు. విషయం తెలిసి ఆ సంస్థ అతడిని ఉద్యోగం నుంచి తీసేసింది. సొంత ఆస్తులమ్మి ఆ సంస్థకు చెల్లించాల్సిన సొమ్ము కట్టారు. నెల్లూరుకు చెందిన ఓ వ్యాపారి రెండు నెలలు వ్యవధిలో దాదాపు రూ.50 లక్షల వరకు పోగొట్టుకున్నారు.

మేము ఆన్‌లైన్‌లో ఆడే ఆట మొత్తం నిర్వాహకులకు తెలుస్తోంది. జరిగే పందేలకు అనుగుణంగా నిర్వాహకులే డమ్మీ పేర్లతో కొందరు ఆటగాళ్లుగా చేరి మొత్తం దోచుకుంటున్నారని... రూ.20 లక్షల పొగొట్టుకున్న విశాఖపట్నానికి చెందిన ఓ బాధితుడు చెప్పారు.

20కు పైగా యాప్‌లు

ఆన్‌లైన్‌లో పేకాటకు సంబంధించి 20కు పైగా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలతో కూడిన ప్రకటనలు సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ, ఇతర ప్రసార మాధ్యమాల్లో వెల్లువెత్తుతుంటాయి. కొన్ని యాప్‌లైతే ప్రారంభ ప్రోత్సాహకాల్ని అందిస్తున్నాయి. మరొకరితో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయిస్తే వారి ఖాతాల్లో కొంత మొత్తాన్ని వేస్తున్నాయి.

ఇదీ చదవండి:

పిడుగుల ధాటికి దెబ్బతిన్న తాజ్​మహల్ ప్రాంగణం​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.