సీపీఐకు చెందిన 16 ఫ్రంట్ సంస్థలను చట్టవిరుద్ధ సంఘాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటి కార్యకలాపాలపై ఏడాదిపాటు నిషేధం విధించింది. మార్చి 30 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఆయా సంస్థలు హింస, బెదిరింపులకు పాల్పడటం కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులతో ఈ సంస్థలు తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నగరాల్లో అర్బన్ గేరిల్లాలను తయారు చేస్తున్నట్లు తెలిపింది.
ప్రభుత్వం నిషేధించిన సంస్థలు..
తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ అసంగటిత కార్మిక సాంఖ్య, తెలంగాణ విద్యార్థి వేదిక, డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, తెలంగాణ విద్యార్థి సంఘం, ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, తెలంగాణ రైతాంగ సమితి, తుడుం దెబ్బ, ప్రజా కళా మండలి, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, ఫోరమ్ ఎగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్, సివిల్ లిబర్టీస్ కమిటీ, అమరుల బంధు మిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం, రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్.
ఇదీ చూడండి: