Gas Refill Center Blast: హైదరాబాద్ జీడిమెట్ల సుభాష్ నగర్‌లోని గ్యాస్ రీఫిల్ సెంటర్‌లో పేలుడు ప్రమాదంలో ఒకరు మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఫైర్ సేఫ్టీ గ్యాస్‌ను ఫిల్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది.
రాం బిలాస్ అనే వ్యక్తి తన ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫైర్ సెఫ్టీ గ్యాస్‌ను గత కొంతకాలంగా రీఫిల్ చేస్తున్నాడు. ఈరోజు కూడా.. గ్యాస్ నింపుతుండగా.. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముకుంద్ కుమార్(28) శరీరం రెండు భాగాలుగా విడిపోయి.. అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు కుమార్, విజయ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఫిల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: