ETV Bharat / city

బలపడి.. మళ్లీ వాయుగుండంగా..! - updates on rains in ap

వాయుగుండం ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గాకు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్టు ఐఎండీ తెలిపింది. ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడే సూచనలున్నట్లు వెల్లడించింది. 16వ తేదీనాటికి అరేబియా సముద్రంపైకి వెళ్లిన అనంతరం మళ్లీ బలపడి వాయుగుండంగా మారనున్నట్టు ఐఎండీ తెలిపింది.

one more deep depression in india
బలహీనపడి.. మళ్లీ వాయుగుండంగా..!
author img

By

Published : Oct 14, 2020, 3:00 PM IST

Updated : Oct 14, 2020, 3:51 PM IST

నిన్న కాకినాడ వద్ద తీరాన్ని దాటిన వాయుగుండం ఇంకా స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణాలపై కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం తెలిపింది. భూభాగం పైకి వచ్చినా ఇది ఇంకా బలహీనపడకుండా స్థిరంగానే కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గాకు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్టు ఐఎండీ స్పష్టం చేసింది. పశ్చిమవాయువ్య దిశగా 25 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది.

ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది అల్పపీడనంగా మారిన అనంతరం పశ్చిమ వాయువ్య దిశగానే కదులుతూ అరేబియా సముద్రంపైకి వెళ్లనుందని స్పష్టం చేసింది.16వ తేదీనాటికి అరేబియా సముద్రంపైకి వెళ్లిన అనంతరం మళ్లీ బలపడి వాయుగుండంగా మారనున్నట్టు ఐఎండీ వెల్లడించింది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ మహారాష్ట్ర-గుజరాత్ కు దక్షిణంగా ఇది తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణా, మహారాష్ట్రల భూభాగంపై కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం ప్రభావంతో తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల 20 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయ్యే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణాతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని షోలాపూర్, విదర్భ, మరట్వాడా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో 15వ తేదీ నుంచి మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, కర్ణాటకలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

Last Updated : Oct 14, 2020, 3:51 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.