ETV Bharat / city

మరోసారి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

author img

By

Published : Dec 15, 2021, 2:08 PM IST

Updated : Dec 15, 2021, 4:38 PM IST

Government meet with AP Employees Union
మరోసారి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

14:04 December 15

Government meet with AP Employees Union : కనీసం 50శాతం ఫిట్​మెంట్​ ఇవ్వాల్సిందే....

Government meet with AP Employees Union :సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం మరో మారు సమావేశం ఏర్పాటుచేసింది. ఆర్ధిక మంత్రి బుగ్గన నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఆర్ధిక శాఖ అధికారులు హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల తరపున నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పీఆర్సీ సహా 71 డిమాండ్​లపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి నల్లబ్యాడ్జీలు ధరించి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘ నాయకులు హాజరయ్యారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిట్​మెంట్​ సహా ఉద్యోగుల సమస్యలపై నేతలతో ఆర్ధిక మంత్రి బుగ్గన, సలహాదారు సజ్జల చర్చిస్తున్నారు. కనీసం 50 శాతం మేర ఫిట్​మెంట్​ ఇవ్వాల్సిందేనంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీతాల పెంపు అమలు తేదీల పైనా సమావేశంలో చర్చించారు. 2018 జులై నుంచి పెంచిన జీతాలను వర్తింప చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. 2022 అక్టోబర్ నుంచి సవరించిన జీతాలను వర్తింప చేయాలని సీఎస్ కమిటీ సిఫార్సు చేసిందని అధికారులు తెలిపారు.

చర్చలు జరుగుతున్న తీరుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తన వంతు సమయం వచ్చినప్పుడు చర్చకు వస్తానని ప్రకటించి ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సమావేశం నుంచి బయకొచ్చేశారు. చర్చల్లో అసలు విషయం కాకుండా అక్కర్లేని ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ బండి శ్రీనివాస రావు, బొప్పరాజులపై మండిపడ్డారు. చర్చల తరహాలో కాకుండా చిట్ చాట్ తరహాలో సమావేశం జరుగుతోందని సూర్యనారాయణ ఆరోపించారు. ఆర్ధిక మంత్రి పేషీ వద్ద ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వేచి ఉన్నారు.

ఇదీ చదవండి : Rs. 5 LAKHS EX GRATIA: బస్సు ప్రమాదంపై గవర్నర్, సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల పరిహారం

Last Updated : Dec 15, 2021, 4:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.