ETV Bharat / city

హైకోర్టు తీర్పుతో.. రాజధాని నిర్మాణంపై చిగురించిన ఆశలు

author img

By

Published : Mar 4, 2022, 3:53 PM IST

Updated : Mar 4, 2022, 5:59 PM IST

Amaravathi: రాష్ట్రానికి రాజధాని నగరమంటూ లేకుండా నడిరోడ్డుపై నిలబడిన దశలో.. అంతర్జాతీయ స్థాయి ప్రజారాజధానికి అమరావతిలో గత ప్రభుత్వం బీజం వేసింది. దేశంలోనే మొదటిసారిగా వినూత్న విధానంలో రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి భూమి సేకరించింది. 10 వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి మహోజ్జ్వల రాజధానిని గత ప్రభుత్వం స్వప్నించింది. భూమి, వనరులు, ప్రణాళికలు, ఆకృతులు అన్నీ సిద్ధమై.. ఇక నిర్మాణం పరుగులు పెట్టడమే తరువాయి అనుకున్నదశలో, అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని పట్టించుకోలేదు. 2019 డిసెంబరులో వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదికి తెచ్చింది. తాజాగా హైకోర్టు తీర్పుతో మరోసారి అమరావతి రాజధాని నిర్మాణంపై ఆశలు చిగురుస్తున్నాయి.

amaravathi capital
హైకోర్టు తీర్పుతో మరోసారి రాజధాని నిర్మాణంపై చిగురించిన ఆశలు

Nadu-Nedu: రాష్ట్రానికి రాజధాని నగరమంటూ లేకుండా నడిరోడ్డుపై నిలబడిన దశలో... అంతర్జాతీయ స్థాయి ప్రజా రాజధానికి అమరావతిలో గత ప్రభుత్వం బీజం వేసింది. ఆర్థిక కార్యకలాపాలకు, సంపద సృష్టికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నిలయంగా తీర్చిదిద్దాలన్న బృహత్‌ సంక్పలంతో అమరావతి నిర్మాణం ప్రారంభించింది. దేశంలోనే మొదటిసారిగా వినూత్న విధానంలో రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి భూమి సమీకరించింది. 10 వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి మహోజ్జ్వల రాజధానిని గత ప్రభుత్వం స్వప్నించింది. ఆరంభంలో ఉద్యమంలా సాగిన నిర్మాణాలతో సందడిగా కనిపించిన రాజధాని ప్రాంతం ఇప్పుడు..... పూర్తి స్తబ్ధుగా మారింది. తాజాగా హైకోర్టు తీర్పుతో మరోసారి రాజధాని నిర్మాణంపై ఆశలు చిగురుస్తున్నాయి.

హైకోర్టు తీర్పుతో.. రాజధాని నిర్మాణంపై చిగురించిన ఆశలు

సొంత కాళ్లపై నిలబడి అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దిన స్వయం చాలిత నగరం అమరావతి. రాజధాని నిర్మాణానికి 2018-2025 మధ్య రాష్ట్ర ప్రభుత్వం నుంచి CRDA మొత్తంగా కోరింది 12వేల 600 కోట్ల రూపాయలే. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, ప్రభుత్వ అవసరాలకు భూములు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం దగర 10 వేల ఎకరాల భూమి ఉండేది. రాజధాని నిర్మాణం అనుకున్నట్టు పూర్తయితే భూముల విలువ ఎకరం 10 కోట్లకు చేరేది. ప్రభుత్వం దగరున్న భూమి విలువే లక్ష కోట్లకు చేరేది. అమరావతి నుంచే పరిపాలన సాగించేందుకు వీలుగా సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణాన్ని గత ప్రభుత్వం శరవేగంగా పూర్తిచేసింది. హైకోర్టు జడ్జిలు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, గెజిటెడ్, నాన్‌ గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం చేపట్టిన బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు కూడా చాలా వరకు పూర్తయ్యాయి. గత ప్రభుత్వం అమరావతిలో 42వేల 170 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవగా 41వేల 678 కోట్ల విలువైన పనులు మొదలయ్యాయి. 10 వేల కోట్లు ఖర్చు కూడా చేశారు.

అమరావతి నిర్మాణం కొనసాగినంత కాలం అటు అమరావతిలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఎక్కడ చూసినా ఉత్సాహం కనిపించేది. ఏ రోజు చూసినా 20 వేల మంది వరకూ కార్మికులు పనిచేసేవారు. అమరావతి ప్రాజెక్టుల్లో పాలు పంచుకోవడానికి, పెట్టుబడి అవకాశాల్ని పరిశీలిచేందుకు వచ్చే దేశ, విదేశీ ప్రతినిధులతో అమరావతి, విజయవాడ ప్రాంతాలు సందడిగా ఉండేవి. అప్పట్లో విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు కూడా నడిచింది.

భూమి, వనరులు, ప్రణాళికలు, ఆకృతులు అన్నీ సిద్ధమై.. ఇక నిర్మాణం పరుగులు పెట్టడమే తరువాయి.. అనుకున్నదశలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని పట్టించుకోలేదు. అమరావతిలో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సింగపూర్‌ కన్సార్షియం స్టార్టప్‌ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోయింది. 2019 డిసెంబరులో ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదికి తెచ్చింది. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, ఒక సామాజికవర్గం ప్రయోజనాల కోసమే ఆ ప్రాజెక్టు చేపట్టారని వైకాపా నేతలు ఆరోపించారు. అమరావతి శ్మశానమని, అక్కడి భూమి భారీ నిర్మాణాలకు పనికిరాదని, చాలా ఖర్చవుతుందని, కృష్ణా నదికి వరదలొస్తే మునిగిపోతుందని రకరకాల అభాండాలు వేశారు.

వైకాపా ప్రభుత్వ వైఖరితో అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసినా పునాదుల దశలో ఆగిన నిర్మాణాలు కొన్ని... సగం పూర్తయి శిథిలమవుతున్న నిర్మాణాలు మరికొన్ని కనిపిస్తున్నాయి. వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించిన డబ్బంతా వృథా అవుతున్నా, ఇప్పటికే పూర్తయిన భవనాలు శిథిలమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, అఖిలభారత సర్వీసు అధికారుల కోసం తలపెట్టిన అపార్ట్‌మెంట్‌ టవర్లు, బంగ్లాలు... 120 కోట్ల వ్యయంతో హైకోర్టు, సచివాలయ భవనాలకు వేసిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ శిథిలవుతున్నాపట్టించుకోవడం లేదు. సగం పూర్తయిన రహదారుల్ని మధ్యలోనే వదిలేయడంతో నిర్వహణ లేక శిథిలమవుతున్నాయి. బ్రిడ్జిలను మధ్యలోనే వదిలేయడంతో వాటి నుంచి కంకర, ఇనుము బయటికి వచ్చి నిర్మాణాలు దెబ్బతింటున్నాయి.

అమరావతిని భవిష్యత్తులో ఒక మహానగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం పలు ప్రాజెక్టులు రూపొందించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించింది. కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణ ప్రాజెక్టు, అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేను పూర్తిగా పక్కన పెట్టేసి, ప్రత్యామ్నాయంగా కొడికొండ-మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వే పేరుతో మరో మార్గాన్ని తెరపైకి తెచ్చింది. అమరావతి మీదుగా విజయవాడ-గుంటూరు రైల్వే ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా ఎంతిచ్చేది చెప్పకుండా నిర్లక్ష్యం చేసింది. విజయవాడ మెట్రో ప్రాజెక్టునూ పట్టించుకోలేదు. రాజధానిలో కొంచెం డబ్బు వ్యయం చేస్తే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నిర్మాణం పూర్తిచేయకుండా కరకట్ట రోడ్డుని విస్తరిస్తామని చెప్పింది.

ప్రభుత్వ వైఖరితో అమరావతిలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కొన్ని వేల కోట్ల సంపద ఆవిరైంది. భూముల ధరలు భారీగా పతనమయ్యాయి. అమరావతికి సమాంతరంగా... కనకదుర్గ వారధి నుంచి అటు నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి అటూ ఇటూ కొన్ని వేల కోట్ల విలువైన భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు వచ్చాయి. అమరావతి నిర్మాణం నిలిచిపోవడంతో అలాంటి భారీ ప్రాజెక్టులు కొన్ని దివాలా తీశాయి. చాలా ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోయాయి. ఇప్పుడు అమరావతికి అప్పు కావాలని CRDA అడుగుతున్నా... బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. ఇదీ ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కనిపిస్తున్న దృశ్యం.

ఇదీ చదవండి: పాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: హోంమంత్రి

Last Updated : Mar 4, 2022, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.