New Year Celebrations at Dubai: ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లోకి రాగా.. హైదరాబాద్‌లోనూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది జోష్‌ను పెంచుకునేందుకు కొందరు విదేశాలను ఎంచుకుంటున్నారు. ఇందులో దుబాయ్ ముందు స్థానంలో ఉంది.
అక్కడికే ఎందుకంటే.. ఇప్పటికే దుబాయ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌పో జరుగుతోంది. కొత్త ఏడాది సందర్భంగా వివిధ రకాల ఈవెంట్లను నిర్వహిస్తోంది. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ నివేదిక ఉంటే చాలు ఈవెంట్లలో పాల్గొనేందుకు దుబాయ్ ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతానికి నయా సాల్ వేడుకల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఈసారి బాణసంచా వెలుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు తరలివస్తారని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉన్నతశ్రేణి వర్గాలు సైతం కొత్త ఏడాది వేడుకలకు దుబాయ్‌ని ఎంచుకున్నారు. విమాన టికెట్లు దాదాపుగా బుక్ అయ్యాయి. ఎక్కువగా 30వ తేదీన వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
రెట్టింపైన ఛార్జీలు... సాధారణంగా వారంలో దుబాయ్‌కి 32 విమానాలు ఇక్కడి నుంచి వెళతాయి. వీటిల్లో 5000-5,500 మంది ప్రయాణికులు వెళ్లేవారు. రోజుకు మూడు, నాలుగు విమానాలు నడుస్తుంటాయి. వీటికితోడు మరో 18-20 విమానాలు కనెక్టింగ్ ఉంటాయి. డిసెంబరు 29, 30, 31 తేదీల్లో దుబాయ్ వెళ్లే విమానాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. టికెట్ ధరలు రెట్టింపయ్యాయి. రూ.14వేల నుంచి రూ.15వేల మధ్య ఉండే టికెట్ ప్రస్తుతం ఏకంగా రూ.35వేల వరకు పలుకుతోంది.
ఇదీ చూడండి: