old woman story : హైదరాబాద్‌కు చెందిన ఈ వృద్ధురాలి పేరు సాధుభాయి. కుటుంబంలో ఏర్పడిన చిన్న గొడవల కారణంగా పదిహేనేళ్లుగా ఇంటిని వదిలి రోడ్డుపై కాలం గడుపుతున్నారు. పదమూడు సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీ, అడిక్‌మెట్ పరిసర ప్రాంతాల్లో రహదారిపైనే ఉంటూ కాలం గడిపారు. తన పిల్లలు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తారని, వారిని ఎలాంటి సాయం అడగనన్నారు. తమతో రమ్మని వారు కోరినా.. ఇష్టం లేక వెళ్లడం లేదని చెప్పారు. బర్కత్‌పురకు వచ్చి రెండు సంవత్సరాలు గడిచిందని, తన దీనస్థితిని చూసి ఓ దాత ఈ పరిసరాల్లోనే చిన్న గూడు కల్పించారని సాధుభాయి చెప్పారు.
రాత్రి సమయంలో అందులో ఉంటూ ఉదయం ఫుట్‌పాత్‌పై కూర్చుని పేపర్ చదువుకుంటానని, డబ్బుల కోసం తానెవరినీ యాచించనన్నారు. తాను పదో తరగతి వరకు చదువుకున్నానని ప్రతి రోజూ ఈనాడు పేపర్‌తో పాటు వారంలో రెండు రోజులు ఆంగ్ల దినపత్రికను కొని చదువుతానని ఆమె వివరించారు.
ఇదీ చదవండి:
Villagers Problem: వంతెన కూలిపోయింది.. ఆ ఊరి వాళ్ల బ్రతుకులు ఆగమయ్యాయి