ETV Bharat / city

Bullet Bandi song : బుల్లెట్​ బండి పాటకు నర్సు స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా..!

author img

By

Published : Aug 21, 2021, 4:50 PM IST

సామాజిక మాధ్యమాల్లో బుల్లెట్​ బండి పాట నెటిజన్లను తెగ ఫిదా చేస్తోంది. నాలుగైదు రోజులుగా మంచిర్యాల జిల్లాకు చెందిన నవవధువు 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. వచ్చేత్తప్పా..' అంటూ చేసిన డ్యాన్స్​ ఇప్పటికే ట్రెండ్​ సెట్​ చేయగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ పాటకే ఓ నర్సు చేసిన డ్యాన్స్​ మరోసారి వైరల్​ అవుతోంది.

బుల్లెట్​ బండి పాట నెటిజన్లను తెగ ఫిదా
బుల్లెట్​ బండి పాట నెటిజన్లను తెగ ఫిదా
బుల్లెట్​ బండి పాటకు నర్సు స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా..!

గత నాలుగైదు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో 'బుల్లెట్​ బండి' పాట తెగ వైరల్​ అవుతోంది. తొలుత తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన నవవధువు సాయి శ్రియ.. తాను మనువాడిన వాడిపై తనకున్న ఇష్టాన్ని తెలియజేస్తూ పెళ్లి బరాత్‌లో 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. వచ్చేత్తప్పా...' అంటూ ఆమె చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఫిదా చేసింది.

ఈ నెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రియకు రామక్రిష్ణాపూర్​కు చెందిన ఆకుల అశోక్​తో వివాహం జరిపించారు. పెళ్లి బరాత్​లో వధువు చేసిన డ్యాన్స్ చూసి ప్రముఖులు కూడా ఈ వీడియోను షేర్ చేసి వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. గాయని మోహన భోగరాజు ఆలపించిన ఈ ‘బుల్లెట్‌ బండి...’ పాటకు నవ వధువు వేసిన స్టెప్పుల వీడియోను మధ్యప్రదేశ్‌లో మార్క్‌ఫెడ్‌ ఎండీగా పని చేస్తున్న రామగుండానికి చెందిన ఐఏఎస్‌ అధికారి పి.నరహరి ట్వీట్‌ చేశారు.

అలాంటి వీడియోనే మరొకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల్లో భాగంగా.. బుల్లెట్​ బండి పాటకు ఓ నర్సు చేసిన డ్యాన్స్​ ఇప్పుడు ట్రెండ్​ అవుతోంది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లోని కారిడార్​లో ఈ వీడియో తీసినట్లుగా తెలుస్తోంది. పాటకు తగ్గట్టుగా సదరు నర్సు చేసిన డ్యాన్స్​ వైరల్​ అవుతోంది. పాటకు తగ్గ హావభావాలు ప్రదర్శించి తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ పాటకు స్టెప్పులేస్తూ.. తోటి వారిని తోడుగా రావాలంటూ కోరడం.. ఆమెను మరింత ఉత్సాహపరిస్తూ అక్కడున్న వారు చప్పట్లు కొడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల అనంతరం.. ఆటవిడుపుగా పాటకు సదరు నర్సు డ్యాన్స్​ చేసినట్లు తెలుస్తోంది.

స్వాతంత్య్ర సంబురాల అనంతరం అందరం కలిసి ఉన్నప్పుడు సరదాగా ఆడిపాడినట్లు నర్సులు చెబుతున్నారు. ఆసుపత్రి కారిడార్​లో నృత్యాలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచూడండి:

'బుల్లెట్‌ బండి' పాట వెనుక ఆ గాయని!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.