ETV Bharat / city

'టెలీమెడిసిన్‌ ద్వారా కరోనా రోగులకు వైద్యం' - cbn news

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 10 వేల మందికి వైద్య సేవలందించడం లక్ష్యం ముందుకెళుతున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు. దీనికోసం వైద్య నిపుణులతో చర్చించేందుకు వెబినార్‌ నిర్వహించారు. "మిలాప్‌" యాప్‌ ద్వారా ఇందుకోసం నిధులను సమీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ntr trust in telemedicine services to covid patients
టెలీమెడిసిన్‌ ద్వారా కరోనా రోగులకు వైద్యం
author img

By

Published : May 18, 2021, 8:20 AM IST

కనీసం 10 వేల మంది కొవిడ్‌ రోగులకైనా తెదేపా, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా టెలీమెడిసిన్‌ విధానంలో సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయడు తెలిపారు. ఇప్పటికే మోడల్‌ ప్రాజెక్టులో భాగంగా హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి వైద్య సలహాలు, మందులు అందిస్తున్నాం. క్వారంటైన్‌లో ఉన్న పేదలకు రోజుకు మూడుసార్లు ఆహారం పంపిస్తున్నాం. కొందరికి ఆక్సిజన్‌ సిలిండర్లూ సమకూర్చాం. ‘మిలాప్‌’ యాప్‌ ద్వారా నిధులు సమీకరిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ‘కరోనా సవాళ్లు-నివారణ చర్యలు’ అన్న అంశంపై ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్య నిపుణులతో జరిగిన వెబినార్‌లో చంద్రబాబు ప్రసంగించారు. ప్రతి లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గ స్థాయిలో వైద్యులను నియమించి రోగులకు సేవలందిస్తామని వివరించారు. వ్యాక్సినేషన్‌ పక్కాగా జరగాలని, అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ దేశాల అనుభవాలు దీన్ని నిరూపిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవలకు వైద్యనిపుణుల సహకారాన్ని కోరారు. వైద్య నిపుణుల అభిప్రాయాలివి..

సత్వరమే చికిత్స ఇవ్వాలి..

"కొవిడ్‌ బాధితులకు సత్వర చికిత్స ముఖ్యం. రోజూ ఆన్‌లైన్‌లో వైద్యుల పర్యవేక్షణ ఉండాలి. టెలీమెడిసిన్‌ విధానంలో 9 నెలలుగా చాలామంది రోగులకు చికిత్స అందించి, నయం చేశాం. ఆక్సిజన్‌ శాతం, రక్తంలో సీఆర్‌పీని రోజూ గమనించాలి. పల్లెటూళ్లలో పల్స్‌ఆక్సీమీటర్లు అందుబాటులో ఉంచాలి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలి."-డాక్టర్‌ లోకేశ్వరరావు, ఎండీ, ఇంటర్నల్‌ మెడిసిన్‌

సానుకూల దృక్పథమే మందు..

"కరోనా మొదటి దశతో పోలిస్తే ఇప్పుడు ఒత్తిళ్లు, ఆర్థిక, కుటుంబ సమస్యలు పెరిగాయి. రకరకాల సమాచారం వచ్చిపడుతోంది. స్టెరాయిడ్స్‌ వాడకం, ఆస్పత్రిలో చేరడం సహా చాలా అంశాల్లో నిపుణుల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. సందిగ్ధ పరిస్థితుల్లో సానుకూల దృక్పథమే సరైన మందు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిని వాలంటీర్లుగా పనిచేసేందుకు ఆహ్వానించి, వారి అనుభవాలు చెప్పించాలి." -కర్రి రామారెడ్డి, మానసిక వైద్య నిపుణులు

బ్లాక్‌ఫంగస్‌తో ముప్పు..

"స్టెరాయిడ్‌లు రెండువైపులా పదునున్న కత్తి వంటివి. కొవిడ్‌ రోగులకు స్టెరాయిడ్‌ వాడితే ప్రాణాలు నిలుస్తున్నాయి. ఎక్కువగా తీసుకుంటే కీటోన్‌లు ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. మూత్రంలో కీటోన్‌లు ఉంటే బ్లాక్‌ఫంగస్‌ ముప్పు ఉంది. హైదరాబాద్‌ నిమ్స్‌లో గతంలో ఏటా 5 బ్లాక్‌ఫంగస్‌ కేసులు వస్తే, ఇప్పుడు వారానికి ఐదు వస్తున్నాయి. మధుమేహులు చక్కెర స్థాయిని నియంత్రించుకోవాలి." -డాక్టర్‌ పి.వి.రావు, ఎండోక్రైనాలజిస్ట్‌

వాస్తవ సమాచారమే నమ్మాలి..

"కొవిడ్‌తో సోషల్‌ ఐసొలేషన్‌ ఎక్కువైంది. ఇది ధూమపానం, ఊబకాయం కంటే ప్రమాదకరం. ఒంటరిగా ఉన్నా సామాజిక మాధ్యమాల ద్వారా బంధుమిత్రులతో బాంధవ్యాలు కొనసాగించాలి. పిల్లల్లోనూ యాంగ్జైటీ, డిప్రెషన్‌ కనిపిస్తున్నాయి. ఆశావహ దృక్పథం ముఖ్యం. ధ్యానం, ప్రాణాయామం, నడక, శారీరక కసరత్తులు కొనసాగించాలి." -డాక్టర్‌ రవి కొల్లి, సైకియాట్రిస్ట్‌

కుప్పంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌..

"కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరఫున పల్స్‌ఆక్సీమీటర్లు, మందులు, శానిటైజర్లు, ఫేస్‌మాస్క్‌లు అందజేస్తున్నాం. కొన్ని ఆస్పత్రులకు ఆక్సి ఫ్లోమీటర్లు అందించాం. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నాం. ఇతర సంస్థల భాగస్వామ్యంతో రక్తం, ప్లాస్మా సమకూరుస్తున్నాం."-రాజేంద్రకుమార్‌, సీఈవో, ఎన్టీఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌

పిల్లలకు ఐసీయూలు సిద్ధం చేయాలి..

"ఈ దఫాలో పిల్లలూ కరోనా బారిన పడుతున్నా, వారిలో తీవ్రత తక్కువగానే ఉంటోంది. పోస్ట్‌ కొవిడ్‌ హైపర్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ప్రమాదాన్ని ముందే గుర్తించాలి. మూడో దశకు ముందే 30 శాతం జనాభాకు వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి. పీడియాట్రిక్‌ ఎమర్జెన్సీకి వీలుగా ఐసీయూలు సిద్ధం చేయాలి. పిల్లలకు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పప్పులు, మాంసం, ఆకుకూరలు, నిమ్మజాతుల ఫలాలు అందించాలి." -డాక్టర్‌ గురుప్రసాద్‌, సీనియర్‌ పీడియాట్రీషియన్‌

యాంటీబయాటిక్స్‌తోనూ ముప్పు..

"బ్లాక్‌ఫంగస్‌ మెదడుకు చేరితే రోగి చనిపోయే ప్రమాదముంది. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు చేతులు, గోళ్ల సందుల్లో తరచూ శుభ్రం చేసుకోవాలి. మధుమేహాన్ని నియంత్రించుకోవాలి. ఇంట్లో ఆవిరి పెట్టుకున్నా డిస్టిల్డ్‌ వాటర్‌ వాడాలి. యాంటీబయాటిక్స్‌ ఎక్కువగా వాడితే పేగుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోయి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది." -డాక్టర్‌ రవికిరణ్‌, న్యూరాలజిస్ట్‌

10 లక్షల మందికి వ్యాక్సిన్లు..

"ప్రస్తుతం మానవాళిపై యుద్ధం జరుగుతోంది. కరోనా బాధితుల్ని ఆదుకోవడానికి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ విస్తృతంగా కృషి చేస్తోంది. త్వరలోనే 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయబోతున్నాం. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌తోనూ కలసి పనిచేయడానికి సిద్ధం." -డా.శ్రీనివాసరాజు, ఐఎంఏ

ఇవీ చదవండి:

నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా జస్టిస్ యు.యు.లలిత్

ఎంపీ రఘురామకు సుప్రీంలో ఊరట.. సైనికాసుపత్రిలో వైద్య పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.