2020-21 వైద్య విద్య ప్రవేశానికి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎన్టీఆర్ యూనివర్శిటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 11వ తేదీ ఉదయం 8 నుంచి 16వ తేదీ ఉదయం 8గంటల వరకు అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్ధులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలని సూచించారు. జనరల్ కేటగిరి విద్యార్ధులకు 147మార్కులు కట్ఆఫ్గా నిర్ణయించనట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది కౌన్సిలింగ్ను ఆన్లైన్లో జరుపుతున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.
ఇదీ చదవండి: