ETV Bharat / city

ఆన్​లైన్​లో వైద్య విద్య.. విద్యార్థుల భవిష్యత్​ భద్రమేనా..?

వైద్య విద్యలో థియరీతో పాటు ప్రాక్టికల్స్​ చాలా కీలకం. ప్రస్తుతం కరోనా వ్యాప్తి దృష్ట్యా వైద్య విద్యార్థులకు ఆన్​లైన్​ ద్వారానే థియరీ, క్లినికల్​ తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. క్లినికల్​ తరగతులను విద్యార్థులకు అర్థమయ్యేలా ఆస్కీ విధానంలో అందిస్తున్నామని ఎన్టీఆర్​ వర్సిటీ రిజిస్ట్రార్​ చెబుతున్నారు. కరోనా విజృంభణ దృష్ట్యా డిజిటల్​ తరగతులు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్​ వైద్య తరగతులపై కథనం..!

ఆన్​లైన్​లో వైద్య విద్య.. విద్యార్థుల భవిష్యత్​ భద్రమేనా..?
ఆన్​లైన్​లో వైద్య విద్య.. విద్యార్థుల భవిష్యత్​ భద్రమేనా..?
author img

By

Published : Jun 28, 2020, 4:51 PM IST

కరోనా విజృంభణ దృష్ట్యా వైద్య విద్యార్థులకు డిజిటల్​ తరగతుల ద్వారా బోధన జరుగుతోంది. అయితే వైద్య విద్యలో క్లినికల్ తరగతులు చాలా కీలకం. సాధారణ రోజుల్లో నేరుగా సంబంధిత రోగుల వద్దకు వెళ్లి వారిని పరీక్షించి రోగ లక్షణాలు, ఏ విధంగా చికిత్స చేయాలో ప్రొఫెసర్ల ద్వారా తెలుసుకుంటారు. కరోనా క్రమంలో క్లినికల్​ తరగతులను సైతం ఆన్​లైన్​లో బోధిస్తున్నారు. అయితే దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు.. ప్రత్యక్షంగా రోగిని పరీక్షించడం ద్వారా పూర్తిస్థాయిలో అర్థమవుతుందని చెబుతున్నారు. ఆన్​లైన్​ ద్వారా ఇది కష్టసాధ్యమవుతోందని అంటున్నారు.

  • ఆస్కీ విధానంలో బోధిస్తున్నాం

క్లినికల్​ తరగతులను విద్యార్థులకు అర్థమయ్యేలా ఆబ్జక్టివ్ స్ట్రక్చరల్ క్లినికల్ ఎగ్జామినేషన్​(ఆస్కీ) విధానంలో బోధిస్తున్నామని ఎన్టీఆర్​ ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్​ చెబుతున్నారు. ఈ విధానంలో రోగి ఎదురుగా ఉన్నట్లే ఉంటుందని.. విద్యార్థులకు స్పష్టంగా అర్థమవుతుందని అంటున్నారు.

  • పరీక్షలూ ఆన్​లైన్​లోనే

ప్రస్తుతం పీజీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు గూగుల్ రూం ద్వారా విద్యా బోధన జరుగుతోందని అధికారులు చెపుతున్నారు. వీరికి వార్షిక పరీక్షలు ఆగస్టులో జరుగుతాయి. కొవిడ్​ దృష్ట్యా ఎంబీబీఎస్​ విద్యార్థులకు ఆన్​లైన్​లో పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని.. పరీక్షలు నిష్పాక్షికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్​ వర్సిటీ రిజిస్ట్రార్​ తెలిపారు. అయితే తక్కువగా ఉన్న పీజీ వైద్య విద్యార్థులకు కళాశాలల్లో పరీక్షలు నిర్వహించేలా యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • క్లినికల్​పై దృష్టి పెట్టాలి

క్లినికల్​ తరగతులను ఆన్​లైన్​ ద్వారా బోధించేటప్పుడు ఏదైనా అనుమానం వస్తే నివృత్తి చేసేలా అవకాశం కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. లాక్​డౌన్​ తర్వాత క్లినికల్​పై ప్రధాన దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఆస్పత్రులకు వెళ్లి ప్రత్యక్షంగా రోగులను పరీక్షిస్తే.. భవిష్యత్​లో రోగులకు నాణ్యమైన చికిత్స అందించగలుగుతారని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చూడండి..

కృష్ణా డెల్టాలో సాగునీటి విడుదలకు కార్యాచరణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.