ETV Bharat / city

ఇంటర్‌ ప్రవేశాల్లో రాయితీల రద్దు.. పేదల చదువుకు పెను భారం

ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను నిలిపివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రవేశాల సమయంలో ఫీజులు పెంచడమే కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు ఇచ్చే రాయితీలను ఎత్తివేశారు. దీంతో పూర్తి మొత్తంలో ఒకేసారి ఫీజులు చెల్లించలేమని తల్లిదండ్రులు అంటున్నారు.

no fee reimbursement for intermediate students
ఇంటర్‌ ప్రవేశాల్లో రాయితీల రద్దు
author img

By

Published : Jan 17, 2021, 1:46 PM IST

no fee reimbursement for intermediate students
ఫీజుల వివరాలు

ఇంటర్‌ విద్యార్థుల ప్రవేశాల సమయంలోనే ఫీజులు పెరగడంపై.. తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా అనేక అవస్థలుపడిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లోనే చదివించేందుకు సిద్ధపడుతుండడంతో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. గతంలో కంటే 20శాతం ఇంటర్‌లో ప్రవేశాలు పెరుగుతాయని విద్యాశాఖ నివేదికలు చెబుతున్నాయి. ప్రవేశాల సమయంలో ఫీజులు పెంచడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు రాయితీ ఎత్తివేశారు. దాంతో ఆయా వర్గాలవారంతా పూర్తి మొత్తంలో ఫీజులు చెల్లించాలని కళాశాలల ప్రధానాచార్యులు చెబుతున్నారు.

ప్రవేశాలకోసం వచ్చే విద్యార్థులు అంత మొత్తం ఒకేసారి చెల్లించలేమంటున్నారు. గతేడాది కంటే 10 శాతం ఫీజులను పెంచడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా రద్దు చేశారు. గతంలో సైన్సు గ్రూపులకు రూ.653, ఆర్ట్స్‌ గ్రూపులకు రూ.319, ఒకేషనల్‌ కోర్సులకు రూ.839 ఫీజులను చెల్లిస్తే ఆయా వర్గాలకు ప్రవేశాలకు కల్పించేవారు. ప్రసుత్తం అన్నివర్గాలకు ఒకే మొత్తంలో ఫీజులు చెల్లించాలనే నిబంధన పెట్టడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమ్మఒడి వర్తింపుతోనే..

ఇంటర్‌ విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తింపజేయడం వల్లనే ఫీజు రాయితీ ఎత్తివేసినట్లు చెబుతున్నారు. గతేడాది నుంచే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు రాకపోవడంతో ఈ ఏడాది నుంచి అన్నివర్గాల విద్యార్థులకు ఒకే మొత్తం ఫీజు నిర్ణయించామంటున్నారు. రీఎంబర్స్‌మెంట్‌ ఉన్న సమయంలో విద్యార్థులకు ఇచ్చిన రాయితీ సొమ్ము వచ్చేదంటున్నారు. ప్రస్తుతం అమ్మఒడితో రీఎంబర్స్‌మెంట్‌తోపాటు ఉపకార వేతనాలు కూడా విద్యార్థులకు లేకుండా పోయాయి. ప్రధానంగా ఆర్ట్స్‌ గ్రూపుల్లోనే 60 శాతానికిపైగా ప్రవేశాలు ఉంటాయి. వారు రూ.319 చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుతం రూ.1,026 ఒకేసారి చెల్లించడం భారంగా మారిందంటున్నారు. పైగా అమ్మఒడి అందరికీ రావడం లేదని ఏదో కారణంతో నిలిపివేయడం వల్ల ఉపకార వేతనాలు కోల్పోవడంతోపాటు మొత్తం ఫీజులు చెల్లించాల్సి వస్తోందంటున్నారు.

ప్రధానాచార్యులదే నిర్ణయం..

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులంతా పూర్తి స్థాయిలో ఫీజులు కట్టాలనే నిబంధన వచ్చింది. గతేడాది ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు రాలేదు. అమ్మఒడి పథకం వర్తింపజేయడం వల్ల రాయితీ లేదు. ఆయా వర్గాల విద్యార్థులు పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించలేని పరిస్థితులుంటే తల్లిదండ్రుల ద్వారా రాత పూర్వక దస్త్రాలు తీసుకుని కళాశాలల ప్రధానాచార్యులు రాయితీగా ఉన్న ఫీజులను కట్టించుకోవచ్ఛు ఏడాది చివర్లో రీఎంబర్స్‌మెంట్‌ రాకపోతే మిగిలిన మొత్తం చెల్లించాల్సిఉంటుంది. ఇది పూర్తిగా ప్రధానాచార్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. - టేకి వెంకటేశ్వరరావు, డీవీఈవో

రాష్ట్రంలో కళాశాలల వివరాలు..

ప్రభుత్వ కళాశాలలు 44

ఎయిడెడ్‌ కళాశాలలు 13

ఏటా ఇంటర్‌ ప్రథమ ప్రవేశాలు62 వేలు

వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 48 వేలు

ఇదీ చదవండి:

'75 శాతం హాజరు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అమలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.