ETV Bharat / city

Police Sub-divisions: ఒకే పోలీసు సబ్‌ డివిజన్‌... 3 జిల్లాల పరిధిలోకి..! - ఏపీ తాజా వార్తలు

Police subdivisions: జిల్లాలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సబ్‌డివిజన్‌లలో మార్పులు, చేర్పులు చేపట్టలేదు. వాటిపై ఇంకా స్పష్టతనివ్వలేదు. నగర కమిషనరేట్‌లను ఆనుకుని ఉన్న ప్రాంతాలు గ్రామీణ పరిధిలోకి తీసుకొచ్చింది. ఏయే పోలీసుస్టేషన్లు ఏయే సబ్‌డివిజన్ల పరిధిలోకి వస్తాయనే దానిపైన నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు కొన్ని స్టేషన్లను సమీపంలోని సబ్‌ డివిజన్లకు అటాచ్‌ చేశారు.

Police subdivisions
పోలీస్ సబ్‌డివిజన్‌లలో మార్పులు, చేర్పులపై రాని స్పష్టత
author img

By

Published : Apr 5, 2022, 7:06 AM IST

Police subdivisions: రాష్ట్రంలోని రెవెన్యూ జిల్లాల సరిహద్దులతో పోలీసు యూనిట్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ మేరకు పోలీసు సబ్‌డివిజన్‌లలో మార్పులు, చేర్పులు చేపట్టలేదు. కొన్ని పోలీసు సబ్‌డివిజన్‌ల్లోని పోలీసుస్టేషన్లు రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. అవసరమైనచోట కొత్తగా సబ్‌డివిజన్లు ఏర్పాటు చేయటంతో పాటు ఇప్పటికే ఉన్న వాటిలో తగిన మార్పులు, చేర్పులు చేయాల్సి ఉన్నప్పటికీ సోమవారం వరకూ ప్రకటన రాలేదు. ఏయే పోలీసుస్టేషన్లు ఏయే సబ్‌డివిజన్ల పరిధిలోకి వస్తాయనే దానిపైన నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు కొన్ని స్టేషన్లను సమీపంలోని సబ్‌ డివిజన్లకు అటాచ్‌ చేశారు.

3 జిల్లాల పరిధిలోకి: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలోని పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, బత్తిలి, దోనుబాయి స్టేషన్లు పార్వతీపురం మన్యం జిల్లాలో కలిశాయి. రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి ఆముదాలవలస విజయనగరం జిల్లాలో కలిశాయి. కొత్తూరు, పాతపట్నం, సారవకోట, మెళియాపుట్టి పోలీసుస్టేషన్లు శ్రీకాకుళం జిల్లాలో మిగిలాయి.

  • ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు సబ్‌ డివిజన్‌ పరిధిలోని నూజివీడు టౌన్‌, రూరల్‌, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి పోలీసుస్టేషన్లు ఏలూరు జిల్లాలో కలిశాయి. మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఏ.కొండూరు, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చాయి. హనుమాన్‌ జంక్షన్‌, వీరవల్లి కృష్ణా జిల్లాలో మిగిలాయి. ఈ పోలీసుస్టేషన్లు ఆయా జిల్లాల పరిధిలోకి వెళ్లినప్పటికీ అవి ఏ పోలీసు సబ్‌డివిజన్‌ పరిధిలోకి వస్తాయనే దానిపై నోటిఫికేషన్‌ విడుదల కాలేదు.

ఏ సబ్‌డివిజన్‌ పరిధిలోకి?: విశాఖ నగర కమిషనరేట్‌లోని దక్షిణ సబ్‌డివిజన్‌ పరిధిలో పరవాడ పోలీసుస్టేషన్‌ ఉండేది. ఇప్పుడు దాన్ని అనకాపల్లి జిల్లాలో చేర్చారు.

  • కడప జిల్లా ఒంటిమిట్ట, సిద్ధవటం పోలీసుస్టేషన్లు ప్రస్తుతం రాజంపేట సబ్‌ డివిజన్‌లో ఉన్నాయి. ఈ సబ్‌డివిజన్‌లోని మిగతా పోలీసు స్టేషన్లు రాయచోటి జిల్లాలో కలిసిపోయాయి. ఒంటిమిట్ట, సిద్ధవటం కడప జిల్లాలో మిగిలాయి.
  • విజయవాడ నగర కమిషనరేట్‌ తూర్పు జోన్‌ పరిధిలోని గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, ఉంగుటూరు, తోట్లవల్లూరు, పమిడిముక్కల పోలీసుస్టేషన్లు పూర్తిగా కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్లిపోయాయి. వీటన్నింటినీ కలిపి గన్నవరం కేంద్రంగా పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటు చేస్తారన్న ప్రతిపాదన ఉంది.
  • గన్నవరం పోలీసుస్టేషన్‌, దాని పరిధిలోని అంతర్జాతీయ విమానాశ్రయం మొన్నటివరకూ విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో ఉండేది. ఆ స్టేషన్‌ను కృష్ణా జిల్లా పరిధిలో చేర్చారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌, ప్రతిపక్ష నేత, మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సహా అనేక మంది ప్రముఖులు విజయవాడ మీదుగానే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తుంటారు. దాన్ని కృష్ణా జిల్లా పరిధిలో చేర్చటం వల్ల ప్రముఖుల రాకపోకల సమన్వయం, భద్రత తదితర అంశాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
  • గన్నవరం, పెనమలూరు ఈ రెండు ప్రాంతాలు దాదాపు విజయవాడతో కలిసిపోయాయి. అపార్ట్‌మెంట్లు, టౌన్‌షిప్‌లు, వివిధ వాణిజ్య సముదాయాలు వంటివి అనేకం వస్తున్నాయి. వీటిని కృష్ణా జిల్లా పోలీసు యూనిట్‌ పరిధిలో చేర్చారు. క్షేత్రస్థాయిలో నేర నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో రెండు యూనిట్ల మధ్య సమన్వయం చేసుకోవటంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

పరవాడ.. అనకాపల్లి పోలీసు జిల్లాలోకి: పారిశ్రామిక ప్రాంతమైన పరవాడ విశాఖ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఉండేది. దీన్ని అనకాపల్లి పోలీసు యూనిట్‌ పరిధిలో చేర్చారు. సాధారణంగా నగరానికి ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాల్ని, నగరంలో అంతర్భాగంగా మారిపోతున్న ప్రాంతాల్ని కమిషనరేట్‌ల భౌగోళిక పరిధిలోకి తీసుకొస్తుంటారు. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటికే నగరంలో ఉన్న ప్రాంతాల్ని గ్రామీణ పోలీసు యూనిట్‌లోకి మార్చారు. పరవాడ పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ పోలీసింగ్‌ పరంగా ప్రత్యేకంగా దృష్టిసారించాల్సి ఉంటుంది. అలాంటి నైపుణ్యాలు, వనరులు గ్రామీణ పోలీసు యూనిట్లతో పోలిస్తే నగర పోలీసు యూనిట్‌లకు కాస్తా ఎక్కువ ఉంటాయి.

ఇదీ చదవండి: 'నూతన జిల్లాలతో.. సరికొత్త పాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.